Prabhas : ప్రభాస్ 7 సినిమాల లైనప్.. రచ్చ రంబోలా..!
Prabhas హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజి సినిమా సెట్స్ మీద ఉంది. ఐతే ప్రభాస్ ఇంకా ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ కాలేదు. సందీప్ వంగాతో స్పిరిట్ కూడా ఉంది. ఈ రెండితో పాటు కల్కి 2
- By Ramesh Published Date - 07:21 AM, Sun - 1 December 24

రెబల్ స్టార్ (Rebal Star) ప్రభాస్ కల్కి తర్వాత రాజా సాబ్ షూటింగ్ లో ఉన్నాడు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఒకటి రెండు కాదు ఏకంగా ఆరేడు సినిమాలు లైన్ లో పెట్టాడు ప్రభాస్. రాజా సాబ్ షూటింగ్ దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ థ్రిల్లర్ జోనర్ ని టచ్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
రాజా సాబ్ (Rajasaab) తో పాటుగా హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజి సినిమా సెట్స్ మీద ఉంది. ఐతే ప్రభాస్ ఇంకా ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ కాలేదు. సందీప్ వంగాతో స్పిరిట్ కూడా ఉంది. ఈ రెండితో పాటు కల్కి 2 (Kalki 2), సలార్ 2 ఉన్నాయి. ప్రభాస్ (Prabhas) తో సినిమా కోసం ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ దాదాపు వరుసగా 7 సినిమాలను లైన్ లో పెట్టాడు. సో ప్రభాస్ తో సినిమా అంటే కొత్త వారికి కష్టమే అని చెప్పారు. ఈ 7 సినిమాలు ఎలా లేదన్నా ఈ 10 ఏళ్లు టైం పట్టేలా ఉన్నాయి.
ప్రభాస్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించనున్నాడు. రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10, 2025 న రిలీజ్ ఫిక్స్ చేశారు.
Also Read : Mokshagna NTR : మోక్షజ్ఞ, ఎన్టీఆర్.. ఫైట్ తప్పదా..?