Pelli Pustakam : బాదం ఆకుల విస్తరాకు కోసం షూటింగ్ ఆపేసిన స్టార్ డైరెక్టర్..
- By News Desk Published Date - 10:00 PM, Sun - 17 September 23

టాలీవుడ్(Tollywood) హిస్టరీలో బాపు-రమణలు(Bapu – Ramana) తెరకెక్కించే సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా అద్భుతమైన దృశ్య కావ్యంలా సినిమాని తెరకెక్కించి ప్రేక్షకులను ఆ సినిమా ట్రాన్స్ లోకి తీసుకు వెళ్ళిపోతారు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరి కలం నుంచి పుట్టుకొచ్చిన ఒక సినిమానే ‘పెళ్లిపుస్తకం’(Pelli Pusthakam). 1991లో రాజేంద్రప్రసాద్, దివ్యవాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికి ఈ సినిమాలోని పెళ్లి సాంగ్ లేకుండా ఏ పెళ్లి జరగదు.
అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని బాదం ఆకుల(Almond Leaves) విస్తరాకుతో రాశారు రమణ. సాక్షి రంగారావు, రాధాకుమారి బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటారని రమణ స్క్రిప్ట్ లో రాశారు. ఇక బాపు కూడా ఆ షాట్ ని అలాగే రాసుకోవడంతో.. నెక్స్ట్ రోజు షూటింగ్ కి బాదం ఆకుల విస్తర్లు తెప్పించమని ప్రొడక్షన్ వారికి చెప్పారు. అయితే ప్రొడక్షన్ బాయ్స్ కి బాదం ఆకులు దొరకపోవడంతో.. ఏ విస్తరు అయితే ఏముంది అనుకోని మామూలు విస్తరాకులు తీసుకు వచ్చేశారు. ఇక నెక్స్ట్ డే షూటింగ్ మొదలైన తరువాత బాదం ఆకుల విస్తర్లు కనిపించకపోవడంతో బాపు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదం ఆకుల విస్తర్లు దొరకలేదని ప్రొడక్షన్ టీం చెప్పిందట.
‘ఇంత పెద్ద హైదరాబాద్ లో ఏ ఇంటిలోనూ బాదం చెట్టు లేదా..? నాకు బాదం ఆకు విస్తర్లే కావాలి, వెళ్లి తీసుకురండి’ అని బాపు రెండు కారులు ఇచ్చి పంపించారు. అవి వచ్చేదాకా షూటింగ్ ఆపేశారు. అలా హైదరాబాద్ మొత్తం తిరిగిన ప్రొడక్షన్ టీం.. చివరికి ఎవరి ఇంటిలోనో ఉన్నాయని తెలుసుకొని వెళ్లి తీసుకొచ్చి ఎట్టకేలకు బాదం ఆకుల విస్తర్లు రెడీ చేశారు. దీంతో మార్నింగ్ జరగాల్సిన షూటింగ్ మధ్యాహ్నం మొదలయింది. అయితే ఇంత కష్టపడి తెచ్చిన బాదం ఇస్తర్లు సీన్ ని మూవీ నిడివి ఎక్కువ అవ్వడంతో సినిమా రిలీజ్ సమయంలో ఎడిటింగ్ లో తీసేశారు. ఇక ఈ సినిమాకు నిర్మాతలు కూడా బాపు రమణలే.
Also Read : Bhagavanth Kesari : చంద్రబాబు అరెస్టుతో.. బాలయ్య భగవంత్ కేసరి సినిమా వాయిదా..?