Bhagavanth Kesari : చంద్రబాబు అరెస్టుతో.. బాలయ్య భగవంత్ కేసరి సినిమా వాయిదా..?
భగవంత్ కేసరి సినిమా వాయిదా పడుతుందని ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత బాలకృష్ణ ఏపీ వెళ్ళిపోయి అక్కడి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
- Author : News Desk
Date : 17-09-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
బాలకృష్ణ(Balakrishna) అఖండ(Akhanda), వీరసింహ రెడ్డి(Veerasimha Reddy) సినిమాలతో వచ్చి భారీ విజయాలు సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో రాబోతున్నారు. బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాని అక్టోబర్ 19న దసరాకి(Dasara) రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు.
అయితే భగవంత్ కేసరి సినిమా వాయిదా పడుతుందని ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత బాలకృష్ణ ఏపీ వెళ్ళిపోయి అక్కడి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉండటంతో బాలయ్యే ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. దీంతో బాబు బయటకు వచ్చేవరకు బాలయ్య ఏపీ రాజకీయాల్లో బిజీగానే ఉంటారని తెలుస్తుంది.
అయితే భగవంత్ కేసరి ఇంకొంచెం షూటింగ్ మిగిలి ఉందని, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అవ్వలేదని సమాచారం. బాలయ్య ఇలాంటి సమయంలో షూటింగ్ కి వచ్చి, డబ్బింగ్ చెప్పేంత ఖాళీ లేదు. ఇది అయ్యేపని కూడా కాదు. దీంతో సినిమా అంతా పూర్తిచేసినా బాలయ్య పోర్షన్ మిగిలే ఉంటది కాబట్టి దసరాకి సినిమా రిలీజయ్యే అవకాశం లేదంటున్నారు. కేవలం నెల రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ నెలరోజుల్లో చంద్రబాబు బయటకు వచ్చి ఏపీలో పరిస్థితులు చక్కబడితే తప్ప బాలయ్య సినిమాల వైపు వచ్చే అవకాశం లేదు అని అభిమానులు కూడా భావిస్తున్నారు. దీంతో ఈ సారి దసరాకి భగవంత్ కేసరి సినిమా లేనట్టే అని సమాచారం.
Jawan Collections : జవాన్ టార్గెట్ 1000 కోట్లు.. ఇప్పటికి ఎంతొచ్చింది? ఇంకెంత రావాలి?