Dil Raju : ‘వకీల్ సాబ్’ను పవన్ కల్యాణ్ గుర్తు చేయగానే కన్నీళ్లు వచ్చాయి : దిల్ రాజు
అసలు తాను తీసిన వకీల్ సాబ్ మూవీ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తారని అనుకోలేదని దిల్ రాజు(Dil Raju) చెప్పారు.
- By Pasha Published Date - 12:29 PM, Mon - 6 January 25

Dil Raju : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు నిర్మాత దిల్ రాజు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇంతకీ పవన్ కల్యాణ్ అన్న మాటలేంటి ? ఏ మాటలు విని దిల్ రాజు ఎమోషనల్ అయ్యారు. ఈ వార్తలో చూద్దాం..
Also Read :Aadhaar Card Loan : ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్.. ‘పీఎం స్వనిధి’కి అప్లై చేసేయండి
ఇటీవలే రాంచరణ్‌కు చెందిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు విని దిల్ రాజు ఎమోషనల్ అయ్యారట. ‘‘వకీల్‌సాబ్ మూవీ నుంచి వచ్చిన పారితోషికం నా జనసేన పార్టీకి ఒక ఇంధనంలా పనిచేసింది’’ అని పవన్ చెప్పారు. ఈ మాటలు విని దిల్ రాజు ప్రభావితులయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు తాను తీసిన వకీల్ సాబ్ మూవీ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తారని అనుకోలేదని దిల్ రాజు(Dil Raju) చెప్పారు. ఏపీకిి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తనను గుర్తుపెట్టుకున్నందుకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. ఇందుకోసం పవన్‌కు తన పాదాభివందనం అని దిల్ రాజు తెలిపారు.
Also Read :4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
‘‘పవన్ కల్యాణ్ నాకు స్ఫూర్తి. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించిన ఈవెంట్ సక్సెస్ కావడానికి పవనే కారణం’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ‘‘రాజకీయాల్లోకి వెళ్లగానే పవన్ గెలవలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. 21 అసెంబ్లీ సీట్లలో పోటీచేసి 21 కూడా గెల్చుకున్నారు. పవనే నిజమైన గేమ్ ఛేంజర్’’ అని ఆయన కొనియాడారు. ఆగకుండా శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని పవన్‌ను చూశాకే తనకు అర్ధమైందన్నారు.
త్వరలోనే సీఎం రేవంత్‌ను కలుస్తా
ఒక నిర్మాతగా త్వరలోనే సీఎం రేవంత్‌ను కలిసి టికెట్ రేట్ల గురించి మాట్లాడతానని దిల్ రాజు చెప్పారు. తుది నిర్ణయం ప్రభుత్వానిదే అని తెలిపారు. గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి విడుదల అవుతుందన్నారు. నాలుగేళ్ల క్రితమే ఈ మూవీ స్టోరీ రాసుకున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ నుంచి తిరిగివెళ్తున్న సమయంలో చనిపోయిన ఇద్దరు యువకుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఆయన ప్రకటించారు.