Aadhaar Card Loan : ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్.. ‘పీఎం స్వనిధి’కి అప్లై చేసేయండి
ఈ లోన్‌కు అప్లై చేసే వారి ఆధార్ కార్డుకు ఫోన్ నంబరు(Aadhaar Card Loan) లింక్ అయి ఉండాలి.
- Author : Pasha
Date : 06-01-2025 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
Aadhaar Card Loan : మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా ? అయితే చాలు మీకు రూ.50వేల దాకా లోన్ వస్తుంది. అది కూడా ష్యూరిటీ లేకుండానే. ఇంతకీ అదెలా అనుకుంటున్నారా ? ఈ వార్త చదవండి తెలిసిపోతుంది.
Also Read :4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
చిరువ్యాపారులు, వీధి వ్యాపారులకు అండగా నిలిచేందుకు 2020 సంవత్సరంలో కరోనా సంక్షోభ కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీంను ప్రవేశపెట్టింది. అదే.. పీఎం స్వనిధి యోజన. నాటి నుంచి నేటి దాకా దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ స్కీం నుంచి లోన్ పొందారు. కేవలం ఆధార్ కార్డు సబ్మిట్ చేసి లోన్ డబ్బులు తీసుకున్నారు.
Also Read :Golden Globes 2025 : గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో పాయల్‌కు నిరాశ.. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ వెనుకంజ
పీఎం స్వనిధి యోజన గురించి..
- మీ సమీపంలోని ఏదైనా ప్రభుత్వ బ్యాంకు లేదా కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)కు వెళ్లి పీఎం స్వనిధి యోజన స్కీంకు అప్లై చేయొచ్చు.
- ఈ లోన్‌కు అప్లై చేసే వారి ఆధార్ కార్డుకు ఫోన్ నంబరు(Aadhaar Card Loan) లింక్ అయి ఉండాలి.
- లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేసే క్రమంలో ఈ-కేవైసీ/ఆధార్ వ్యాలిడేషన్ చేస్తారు. ఈక్రమంలో దరఖాస్తుదారుడి ఫోనుకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
- దరఖాస్తుదారుడు పీఎం స్వనిధి లోన్‌కు అప్లై చేసేందుకు తమకు అభ్యంతరం లేదంటూ స్థానిక మున్సిపాలిటీ జారీ చేసిన రికమెండేషన్ లెటర్‌ను కూడా తీసుకోవాలి. దాన్ని అప్లికేషన్‌కు తప్పకుండా జతపర్చాలి.
- వాస్తవానికి ‘పీఎం స్వనిధి’ కింద రూ.50వేల లోన్ మొదటిసారే రాదు. తొలి విడతలో రూ.10వేల లోన్ మాత్రమే ఇస్తారు. దాన్ని 12 వాయిదాలలో తిరిగి చెల్లించాలి. అనంతరం రూ.20వేలు ఇస్తారు. దాన్ని కూడా 12 కిస్తులలో తిరిగి కట్టాలి. ఈవిధంగా విడతల వారీగా రూ.10వేలు పెంచుకుంటూ.. చివరకు రూ.50వేల దాకా లోన్ ఇస్తారు.