OG Movie: రూమర్స్ నమ్మకండి.. ఓజీ మూవీ రిలీజ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
ఓజీ మూవీ విడుదలపై ఎప్పట్నుంచో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ గోల తట్టుకోలేక గతంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓజీ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ వదిలింది.
- Author : Gopichand
Date : 02-07-2025 - 7:59 IST
Published By : Hashtagu Telugu Desk
OG Movie: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన నటించిన చిత్రాలు ప్రస్తుతం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే హరి హర వీరమల్లు సినిమాని ఈనెల 24న ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే ఈ మూవీ తర్వాత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే మూవీ ఓజీ (OG Movie). ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం ఈ మూవీ బాగుంటుందని కామెంట్ చేశారు. ఇప్పటికే ఈ ఓజీ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టైటిల్ సాంగ్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఇంకా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
అయితే ఓజీ మూవీ విడుదలపై ఎప్పట్నుంచో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ గోల తట్టుకోలేక గతంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓజీ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ వదిలింది. అలాగే మూవీ అప్డేట్స్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్‌కు వాయిదా పడినట్లు కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైన మూవీ టీమ్ ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇస్తూ ఎక్స్ పోస్ట్ పెట్టింది.
ఈ మూవీపై వస్తున్న పుకార్లను నమ్మకండి అని తాజాగా ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 25నే ఓజీ రిలీజ్ అని కుండబద్ధలు కొట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rail one APP : రైల్ వన్.. ఇకపై టికెటింగ్, రిజర్వేషన్ వంటి సేవలన్నీ ఓకే యాప్‌లో పొందవచ్చు
Rumours ni Nammakandi… #TheyCallHimOG arrives on Sept 25th!!🤟🏻 #OG pic.twitter.com/JPEyE3SSqe
— DVV Entertainment (@DVVMovies) July 2, 2025
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ మూవీ విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పష్టత ఇచ్చింది. “రూమర్స్ నమ్మకండి, ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుంది” అని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఓజీ’ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న హై-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌లు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.