Pawan Kalyan : OG, వీరమల్లు.. ఏది ముందు..?
Pawan Kalyan మొన్నటిదాకా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం క్రీయాశీలంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గెలిచిన మొదటిసారే డిప్యూటీ సీఎం తో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి
- By Ramesh Published Date - 11:10 PM, Fri - 21 June 24
Pawan Kalyan మొన్నటిదాకా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం క్రీయాశీలంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గెలిచిన మొదటిసారే డిప్యూటీ సీఎం తో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే శాఖలను తీసుకున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అన్న పవన్ అభ్యర్ధనను ఈసారి ఆంధ్రా ప్రజలు అర్ధం చేసుకుని ఆయన్ను గెలిపించారు. కూటమి గెలుపుతో రాష్ట్ర ప్రజల్లో కూడా నూతన ఉత్సాహం కనిపిస్తుంది.
ఐతే పవన్ దర్శక నిర్మాతలు కూడా ఆయన కమిటైన సినిమాలు పూర్తి చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్ లో ఓజీ, క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. వీరమల్లు సినిమా నుంచి క్రిష్ తప్పుకుని జ్యోతి కృష్ణ వచ్చాడు.
ఓ పక్క హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా కూడా లైన్ లో ఉంది. ఐతే హరీష్ శంకర్ పవన్ సినిమా ఎలాగు లేట్ అవుతుందని రవితేజతో సినిమా లాగిచ్చేస్తున్నాడు. సో ఆ సినిమాకు అంత తొందర లేదు కానీ ఓజీ, వీరమల్లు ఈ రెండు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ముందు ఏది పూర్తి చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.
రెండు సినిమాల నిర్మాతలు మా సినిమా ముందంటే మా సినిమా ముందు అంటున్నారట. మరి పవన్ ఈ రెండిటిలో ఏది ముందు పూర్తి చేస్తాడో చూడాలి. ఓజీ సినిమాను అసలైతే సెప్టెంబర్ 27న రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ సినిమా అప్పటికి పూర్తి చేయడం కష్టమని వాయిదా వేశారు. ఓజీ ప్లేస్ లో ఎన్.టి.ఆర్ దేవర రిలీజ్ అవుతుంది.