Agent Release: అఖిల్ ‘ఏజెంట్’ రిలీజ్ అప్పుడే!
దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని తొలిసారిగా స్పై థ్రిల్లర్ కోసం జతకట్టారు. 'ది బోర్న్ ఐడెంటిటీ' సిరీస్ తరహాలో రూపొందించిన
- Author : Balu J
Date : 12-10-2022 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని తొలిసారిగా స్పై థ్రిల్లర్ కోసం జతకట్టారు. ‘ది బోర్న్ ఐడెంటిటీ’ సిరీస్ తరహాలో రూపొందించిన ఏజెంట్ పాత్రలో అఖిల్ కనిపించనున్నాడు. ఈ చిత్రం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. అనేక అడ్డంకులు ఎదుర్కొంది. బడ్జెట్ విషయంలో నిర్మాత అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి మధ్య గొడవ జరగడం కూడా అందుకు కారణం.
ఇటీవలే అంతా సద్దుమణిగింది. అయితే వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. నిర్మాతలు డిసెంబర్ ప్లాన్‌లు ప్రకటించినప్పటికీ ఈ ఏడాది థియేటర్లలో సినిమా విడుదల కాకపోవచ్చునని సమాచారం. “ఏజెంట్” పాన్-ఇండియన్ చిత్రంగా ప్లాన్ చేయబడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వర్క్ చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ మూవీ 2023లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.