Prabhas : హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ స్టోరీ..
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ స్టోరీ..
- By News Desk Published Date - 05:57 AM, Mon - 23 October 23
మన తెలుగు సినిమాను పాన్ ఇండియా(Pan India) స్థాయికి చేర్చిన హీరో ప్రభాస్(Prabhas). ఇవాళ ఈ పాన్ ఇండియా స్టార్, ఇండియన్ సినిమా అని మాట్లాడుతున్నారంటే అది బాహుబలి వల్లే. ఎంతసేపు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని చెప్పుకునే రోజుల నుంచి ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్(Tollywood) కూడా అని చెప్పేలా చేసాడు ప్రభాస్. ఇండియన్ సినిమాని ప్రపంచమంతా తెలిసిలా చేసిన బాహుబలి(Bahubali) ప్రభాస్ పుట్టినరోజు నేడు.
మహేష్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ దూసుకుపోతున్న సమయంలో ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టారు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా మొదటి సినిమా పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత సినిమాకు రెబల్ స్టార్ ఇమేజ్ కూడా పనిచేయలేదు. కానీ మూడో సినిమాగా వచ్చిన వర్షం ప్రభాస్ కు తొలిసారి బిగ్ కమర్షియల్ సూపర్ హిట్ ఇవ్వగా..రాజమౌళి కాంబినేషన్ లో చేసిన ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అందించింది. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు ప్రభాస్. ‘రాఘవేంద్ర’ ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్’ ‘రెబల్’…వంటి ప్రయోగాలు చేసి అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు ప్రభాస్. సినిమా సినిమాకి నటుడిగా ప్రభాస్ వెర్సటాలిటీ చూపిస్తూ వచ్చాడు. మిర్చి సినిమా ఆయన కెరీర్ లో ఓ స్పెషల్ సూపర్ హిట్.
ఇక బాహుబలి రెండు సినిమాల రికార్డ్ స్థాయి విజయాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ మార్కెట్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని రికార్డులెన్నో ప్రభాస్ తిరగరాశారు. తెలుగు సినిమాకు 2000 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని బాహుబలితో ప్రభాస్ నిరూపించాడు. ఓవర్సీస్ మార్కెట్లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి ఇండియన్ హీరో ప్రభాస్. బాహుబలి రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఇక ఓన్లీ తెలుగు సినిమా చేసే స్థాయి దాటిపోయింది. దీంతో ప్రభాస్ ఇమేజ్ కూడా టాలీవుడ్ కే పరిమితం చేయకుండా భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు ప్రభాస్.
ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి విదేశాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానుల్లో యువతతో పాటు సకుటుంబ ప్రేక్షకులు ఉన్నారు. ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్ట్యాచ్యూ కలిగిన తొలి సౌత్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం.
ఇక మరోవైపు సొసైటీకి తన అవసరం కలిగిన ప్రతిసారీ మనసున్న గొప్ప స్టార్ గా ప్రూవ్ చేసుకుంటారు ప్రభాస్. ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇక ప్రభాస్ ఫ్యామిలీ అంటేనే భోజనం పెట్టడంలో స్పెషల్. ఇంటికి ఎవరు వచ్చినా, షూటింగ్స్ లో అయినా, పలుమార్లు అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టారు. సమాజం పట్ల, తన అభిమానుల పట్ల ప్రభాస్ కు ఉన్న ప్రేమని ఇలా ఏదో ఒక రూపంలో చూపిస్తూ ఉంటారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల లైనప్ చూస్తుంటే దిమ్మ తిరగడం ఖాయం. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రాబోతోంది. భారీ బడ్జెట్ తో ప్రపంచస్థాయి టెక్నాలజీతో కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. టాలీవుడ్ హిస్టరీలో కల్కి 2898 ఏడీ సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఒక స్పెషల్ మూవీ కానుంది. ప్రభాస్ ను కొత్త జానర్ లో, సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు దర్శకుడు మారుతి. ఆ తర్వాత టి సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించే స్పిరిట్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జానర్ లో భారీగా తెరకెక్కుతున్నాయి. తన రాబోయే సినిమాలతో తెలుగు సినిమా గర్వించే విజయాలు సాధించాలని కోరుకుంటూ మన డార్లింగ్ ప్రభాస్ కి హ్యాపీ బర్త్ డే.
Related News
Salaar 2 : ప్రభాస్ ‘సలార్ 2’లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్ర కోసం..?
ప్రభాస్ 'సలార్ 2'లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఎవరు ఆ నటుడు..? ఏ పాత్ర కోసం..?