Ormax Media Top 10 Actors : టాప్ 1 ప్రభాస్.. ఆర్మాక్స్ టాప్ 10 స్టార్స్ లో ఐదుగురు తెలుగు స్టార్స్..!
ప్రభాస్ (Prabhas) టాప్ 1 గా నిలిస్తే.. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాం చరణ్ లు కూడా టాప్ 10 లో స్థానం
- By Ramesh Published Date - 08:45 AM, Sat - 24 August 24

Ormax Media Top 10 Actors తెలుగు సినిమాలు.. టాలీవుడ్ స్టార్స్ సృష్టిస్తున్న సంచలనాలు చూసి బాలీవుడ్ యాక్టర్స్ ని నిద్ర పట్టట్లేదు. అందుకే ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూసి అవసరం ఉన్నా లేకపోయినా సరే బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా కల్కి లో ప్రభాస్ ఒక జోకర్ లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి చేసిన కామెంట్స్ తెలిసిందే. ఐతే ఆయన జోకర్ అన్న ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లో టాప్ 1 గా నిలిచాడు.
ప్రతి ఏడాది ఇచ్చినట్టుగానే ఆర్మాక్స్ మీడియా టాప్ 10 మోస్ట్ పాపులర్ లిస్ట్ అనౌన్స్ చేసింది. ఇందులో ప్రభాస్ (Prabhas) టాప్ 1 గా నిలిస్తే.. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాం చరణ్ లు కూడా టాప్ 10 లో స్థానం దక్కించుకున్నారు. టాప్ 10 లో ముగ్గురు మాత్రమే బాలీవుడ్ స్టార్స్ ఉండగా తెలుగు, తమిళ హీరోలు ఏడుగురు ఉన్నారు.
టాప్ 1 లో ప్రభాస్.. సెకండ్ ప్లేస్ లో విజయ్.. థర్డ్ ప్లేస్ లో షారుఖ్ ఖాన్. ఫోర్త్ మహేష్ (Mahesh Babu), ఫిఫ్త్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఏడవ స్థానంలో అల్లు అర్జున్, ఎనిమిదవ స్థానంలో సల్మాన్ ఖాన్, 9వ స్థానంలో రాం చరణ్, 10వ స్థానం లో అజిత్ కుమార్ ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ టాప్ 10 లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు.
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే టాప్ 10 లో అలియా భట్ టాప్ 1 గా ఉండగా సెకండ్ ప్లేస్ లో సమంత, థర్డ్ ప్లేస్ లో దీపిక పదుకొనె, ఫోర్త్ కాజల్, ఫిఫ్త్ నయనతార, ఆరో స్థానంలో కత్రినా కైఫ్ ఉండగా ఏడవ స్థానంలో త్రిష కృష్ణన్ ఎనిమిదవ స్థానకో కియరా అద్వాని, 9వ స్థానంలో కృతి సనన్, 10వ స్థానంలో రష్మిక మందన్న స్థానం దక్కించుకున్నారు.