NTR Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా
- Author : Vamsi Chowdary Korata
Date : 29-06-2026 - 5:35 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సరికొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన సరికొత్త పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం సినిమా ప్రకటన మాత్రమే కాకుండా, పోస్టర్‌పై జోడించిన కొన్ని పవర్ఫుల్ లైన్స్ సినిమా కథాంశంపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
“శివుని పుత్రుడు.. పార్వతి గర్వకారణం.. శాశ్వత సేనాధిపతి” అనే క్యాప్షన్లతో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ లైన్స్ చూస్తుంటే.. త్రివిక్రమ్ ఈసారి ఎన్టీఆర్‌ను ఒక పవర్ఫుల్ మైథలాజికల్ టచ్ లేదా ఎపిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Born in the North.
Forged in the Heartland.
Worshipped in the South.Now… A tale destined to belong to the universe 💥💥#NTRxTrivikram@tarak9999 #Trivikram @anirudhofficial #SRadhaKrishna @NANDAMURIKALYAN @haarikahassine @NTRArtsOfficial @NTRxTrivikram pic.twitter.com/df7t6kD2oJ
— Naga Vamsi (@vamsi84) June 29, 2026