HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr New House Look

NTR New House : ఎన్టీఆర్ కొత్త ఇల్లు అదిరిపోయింది

NTR New House : తాజాగా జూబ్లీహిల్స్‌లో ఉన్న తన ఇంటిని పూర్తిగా పునరుద్ధరించి, కొత్త లుక్ ను తీసుకొచ్చాడు. కొద్ది నెలలుగా ఈ ఇంటి రెనోవేషన్ పనులు కొనసాగగా, ఇప్పుడు అది పూర్తయ్యింది

  • Author : Sudheer Date : 26-07-2025 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr New House
Ntr New House

తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తన ప్రతిభతోనే కాక, తనస్టైల్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఉన్న తన ఇంటిని పూర్తిగా పునరుద్ధరించి, కొత్త లుక్ ను తీసుకొచ్చాడు. కొద్ది నెలలుగా ఈ ఇంటి రెనోవేషన్ పనులు కొనసాగగా, ఇప్పుడు అది పూర్తయ్యింది. ఈ కొత్త ఇంటిలో తారక్ – ప్రణతి జంట తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ చేయించారని సమాచారం. ఫ్లోరింగ్, వాల్ డెకరేషన్, లైటింగ్, షాండ్లియర్స్‌ మొదలైన ప్రతి కోణంలోనూ ఇంటి రూపురేఖలను ఆధునిక శైలిలో తీర్చిదిద్దారు.

ఈ కొత్త ఇంట్లోకి ఇటీవలే ఎన్టీఆర్ ఫ్యామిలీ షిఫ్ట్ కావడంతో ఇంటి పరిసరాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు సందడి చేశారు. ఇంట్లో ప్రతీ గదికీ ప్రత్యేక డిజైన్ ఉండేలా చూసిన తారక్ దంపతులు, తమ అభిరుచులను ప్రతిబింబించేలా ఇంటిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా మోడర్న్ టచ్‌తో కలసిన డిజైనింగ్, హోమ్ డెకోర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో కనిపిస్తున్న లైటింగ్, ఫర్నిచర్, వాల్ ప్యానల్స్ ఎన్టీఆర్ అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి.

HHVM 2 : ‘వీరమల్లు 2 ‘అనేది మరచిపోవాల్సిందేనా..?

ఈ రెనొవేషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఎన్టీఆర్ గతంలో మినిమలిస్ట్ లైఫ్‌స్టైల్‌కి కట్టుబడి ఉండేవాడు. కానీ ఈసారి తన ఇంటిని ప్రీమియం లెవెల్లో మార్చుకున్నాడు. తారక్ హై క్లాస్ ఇంటీరియర్ డిజైన్ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించి, నెలల పాటు పనులు చేయించారట. తారక్ ఫ్యామిలీకి ఇది కొత్త అధ్యాయం లాంటిదిగా మారిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్ 2 ఆగస్టులో విడుదల కానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివతో దేవర 2, త్రివిక్రమ్‌తో ఓ సినిమా, ఎల్సన్ డైరెక్షన్‌లో మరో ప్రాజెక్టు చేస్తున్నారు. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితంలోనూ తారక్ తన స్థాయిని ప్రతిబింబించేలా కొత్త ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • jubilee hills
  • lavish and luxurious residence
  • NTR Movies
  • NTR New House

Related News

Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

ఒక ఉబెర్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, ఒకప్పుడు అమెజాన్‌లో ఉద్యోగిగా పనిచేసిన ఆ డ్రైవర్, డ్రైవింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేశాడని వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి, తన నగరాన్ని అన్వేషిస్తూనే వివిధ నగరాల ప్రజలను కలుసుకునేందుకు వీలు కల్పించే ఉబెర్‌లో చేరాడు. ఉద్యోగి అమెజాన్‌ను వదిలి ఉబెర్

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd