Anupama Parameswaran : అనుపమ పరువు తీసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..!
Anupama Parameswaran సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జోడీగా మల్లిక్ రాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమా డీజే టిల్లు మేనియాను
- Author : Ramesh
Date : 09-04-2024 - 12:37 IST
Published By : Hashtagu Telugu Desk
Anupama Parameswaran సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జోడీగా మల్లిక్ రాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమా డీజే టిల్లు మేనియాను కొనసాగించింది. 100 కోట్లు చెప్పి మరి కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమా సక్సెస్ మీట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. టిల్లు క్యారెక్టర్ గురించి ఆ సినిమా ఇచ్చిన ఫన్ గురించి ఎన్టీఆర్ తన మాటలతో చెప్పడం ఫ్యాన్స్ ని అలరించింది.
అయితే టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొనడం వల్ల తారక్ ఫ్యాన్స్ భారీగా వచ్చారు. ఏదైనా ఈవెంట్ లో స్టార్ హీరో వస్తే ఫ్యాన్స్ హంగామా తెలిసిందే. ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడి ఒక రేంజ్ లో కొనసాగింది. అది ఏ రేంజ్ లో అంటే టిల్లు స్క్వేర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మైక్ అందుకుని మాట్లాడాలని ప్రయత్నించగా ఆమెను మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ గోల చేశారు.
తను మాట్లాడొద్దా వెళ్లిపోవాలా అని అనుపమ అడిగితే వద్దు వెళ్లిపో అనేశారు. దాంతో హర్ట్ అయిన అనుపమ మైక్ ఇచ్చి వెళ్లిపోబోయింది. ఆ టైం లో యాంకర్ సుమ అనుపమని ఒకటి రెండు ప్రశ్నలు వేసి కవర్ చేసింది. స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో తప్ప మిగతా ఎవరు మాట్లాడినా సరే ఇదే రేంజ్ రెస్పాన్స్ అందిస్తారు. సినిమాకు ఎంతోకష్టపడి పనిచేసిన వారంతా కూడా ఇలా ఏదైనా ఈవెంట్ లో స్టార్ హీరో ఫ్యాన్స్ వల్ల అవమానం పొందుతున్నారు.
అంతకుముందు ఈ విషయంపై ఎన్టీఆర్ తో పాటుగా మిగతా స్టార్స్ కూడా ఫ్యాన్స్ కి చెప్పినా అవేవి పట్టించుకోకుండా మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అనుపమ విషయంలో అదే ప్రవర్తించారు. అనుపమ హర్ట్ అయ్యిందో లేదో కానీ స్టార్ ఫ్యాన్స్ ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
Also Read : Family Star : ఫ్యామిలీ స్టార్ నుంచి తప్పించుకున్న ఆ హీరో..?