Family Star : ఫ్యామిలీ స్టార్ నుంచి తప్పించుకున్న ఆ హీరో..?
Family Star విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. లైగర్ తర్వాత ఖుషి కొద్దిగా పర్వాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో సాలిడ్ హిట్ కొడతాడని
- Author : Ramesh
Date : 09-04-2024 - 12:06 IST
Published By : Hashtagu Telugu Desk
Family Star విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. లైగర్ తర్వాత ఖుషి కొద్దిగా పర్వాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో సాలిడ్ హిట్ కొడతాడని అనుకోగా ఆ సినిమా కాస్త నిరాశపరచింది. పరశురాం డైరెక్షన్ లో గీతాగోవిందం లాంటి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అనుకున్న ఆడియన్స్ కు షాక్ తగిలినట్టు అయ్యింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కుతుందని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది.
సినిమా బాగుంది బాగాలేదు అన్నది పక్కన పెడితే సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. వీటి వెనక ఉన్న మోటో ఏంటన్నది తెలియదు కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక హీరో కాదన్న తర్వాత ఈ హీరో దగ్గరకు వచ్చిందని టాక్.
మహేష్ తో సర్కారు వారి పాట తీసే టైం లో అక్కినేని హీరో నాగ చైతన్యతో పరశురాం ఒక సినిమా చేయాల్సి ఉంది. సినిమా కథా చర్చల్లో ఉన్న టైం లోనే మహేష్ ఆఫర్ రాగానే నాగ చైతన్య సినిమాను కాదని పరశురాం మహేష్ తో సినిమా చేశాడు. అయితే అప్పటి నుంచి పరశురాం పై నాగ చైతన్య ఫైర్ అవుతున్నాడు. అతని పేరెత్తితే చాలు టైం వేస్ట్ అతని గురించి మాట్లాడొద్దు అంటున్నాడు.
అయితే మహేష్ తో సినిమా చేయకపోతే మాత్రం నాగ చైతన్యతో పరశురాం చేసే సినిమా ఫ్యామిలీ స్టారే అంటూ చెప్పుకుంటున్నారు. మరోపక్క పరశురాం గీతా ఆర్ట్స్ లో కమిట్ మెంట్ ఉన్నా కూడా సడెన్ గా దిల్ రాజు కాంపౌండ్ లో సినిమా అనౌన్స్ చేసి అటు అల్లు అరవింద్ కి కూడా కోపం వచ్చేలా చేశాడు. దిల్ రాజు పరశురాం విజయ్ దేవరకొండ ఒక సూపర్ హిట్ సినిమా అందిస్తారని అనుకోగా ఫ్యామిలీ స్టార్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
Also Read : Pushpa 2 : పుష్ప 2 ఆ సీన్ కోసం 51 ఒక్క టేకులు తీసుకున్నారా..?