Nora Fatehi : డబ్బులు అవసరం ఉన్నా.. రెమ్యునరేషన్ లేకుండా ఐటెం సాంగ్స్ చేసిన బాలీవుడ్ భామ..
- Author : News Desk
Date : 02-11-2024 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
Nora Fatehi : తెలుగు, బాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో బాగా పేరు తెచ్చుకుంది డ్యాన్సర్, నటి నోరా ఫతేహి. ఓ పక్క సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే ఐటమ్స్ సాంగ్స్ చేస్తూ బాగా వైరల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ తనకు డబ్బులు అవసరం ఉన్న సమయంలో కూడా రెండు ఐటెం సాంగ్స్ ఫ్రీగా చేసానని చెప్పింది.
నోరా ఫతేహి మాట్లాడుతూ.. ఓ సమయంలో నాకు అద్దె కట్టడానికి, ఆల్మోస్ట్ తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను. ఆ సమయంలో నాకు రెండు ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వచ్చాయి. కమారియా సాంగ్, దిల్ బర్ సాంగ్ అవకాశాలు వచ్చాయి. నేను మళ్ళీ బిజీ అవడానికి ఈ సాంగ్స్ నాకు ఉపయోగపడాలని రెండు పాటలు రెమ్యునరేషన్ లేకుండానే చేశాను. డబ్బుల కంటే ముందు నేను నన్ను నిరూపించుకోవాలని, మళ్ళీ నేను బిజీ అవ్వాలని ఆ పాటలు చేశాను అని తెలిపింది.
అలాగే.. ఈ సాంగ్స్ కొరియోగ్రఫీలో కూడా స్పెషల్ కేర్ తీసుకొని దగ్గరుండి డ్యాన్సర్లకు నేర్పించిందట నోరా ఫతేహి. 2018లో సత్యమేవ జయతే లో దిల్ బర్ సాంగ్, స్త్రీ సినిమాలో కమారియా సాంగ్ వచ్చి రెండు పెద్ద హిట్ అయి నోరా ఫతేహికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.
Also Read : Lucky Baskhar : అదరగొడుతున్న లక్కీ భాస్కర్.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..