Nawazuddin Siddiqui Wife: ప్రముఖ నటుడి భార్య సంచలన ఆరోపణలు.. నా భర్త నాపై అత్యాచారం చేశాడంటూ..!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి భార్య (Nawazuddin Siddiqui Wife) ఆలియా సిద్ధిఖి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త నవాజుద్దీన్ సిద్ధిఖి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Author : Gopichand
Date : 25-02-2023 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి భార్య (Nawazuddin Siddiqui Wife) ఆలియా సిద్ధిఖి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త నవాజుద్దీన్ సిద్ధిఖి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తపై రేప్ కేసు పెట్టిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆలియా సిద్ధిఖి.. అందుకు సంబంధించిన ఆధారలను కూడా పోలీసులకు సమర్పించానని స్పష్టం చేసింది. భర్త నవాజుద్దీన్ సిద్ధిఖి తనపై కుట్రలకు పాల్పడుతున్నాడని చెప్పే క్రమంలో ఆలియా కన్నీంటిపర్యంతమయ్యారు.
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ఆలియా సిద్ధిఖీ శుక్రవారం ముంబైలోని వర్సోవా పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై అత్యాచారం ఆరోపణలపై ఫిర్యాదు చేసింది. 2021 సంవత్సరంలో నవాజుద్దీన్ సిద్ధిఖీకి విడాకుల నోటీసు ఇచ్చిన ఆలియా ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. గురువారం పోలీస్ స్టేషన్‌లో సాక్ష్యాలతో కూడిన అత్యాచారం ఫిర్యాదు చేసినట్లు ఆలియా వీడియో పోస్ట్‌లో తెలిపారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆలియా 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఈ జంట గత కొన్ని వారాలుగా ఒకరినొకరు వివిధ గృహ, వ్యక్తిగత సమస్యలపై ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యాంశాలలో ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమార్తె షోరా, కుమారుడు యాని ఉన్నారు.
Also Read: Lokesh Calls Jr.NTR: టీడీపీ సంచలనం.. జూనియర్ NTRకు లోకేష్ పిలుపు!
పిల్లలను తన నుంచి దూరం చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని ఆలియా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సరే తన పిల్లలను అతడి కస్టడీలోకి వెళ్లనివ్వను అని ఆలియా స్పష్టం చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖి తన పిల్లలకు మంచి తండ్రి కూడా కాడు. తన బిడ్డను పుట్టినప్పటి నుంచి ఏనాడు ఆదరించలేదు. ఇప్పుడు వాళ్లు పెరిగి పెద్దవాళ్లు అవుతుంటే వాళ్లను తన సొంతం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. నవాజుద్దీన్ తనను అన్ని వైపుల నుండి బలహీనపరిచాడని ఆలియా ఆరోపించింది. అయితే కోర్టులు, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.
ఒక భార్యగా నవాజుద్దీన్ ఏనాడు నాపై ప్రేమ చూపలేదు. ఏనాడూ నన్ను గౌరవించలేదు. నా జీవితంలో ఎన్నో విలువైన కాలం అతడి కోసం, అతడితో గడిపాను. ఇప్పుడు నేను అన్ని విధాల వీక్ అయ్యాను. ఆర్థికంగానూ వీక్ అయ్యాను. ఫేమ్ అతడి నెత్తికెక్కింది. నా కొడుకును కూడా ఏనాడూ చేరదీయలేదని పేర్కొంది. ఆలియా సిద్ధికి నవాజుద్దీన్ సిద్ధిఖికి రెండో భార్య. 2009లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆలియా అసలు పేరు అంజలి కిషోర్ పాండే. నవాజుద్దీన్‌తో పెళ్లి తరువాత ఆమె ఆలియా సిద్ధిఖిగా పేరు మార్చుకున్నారు.