Naveen Polishetty: ఇంకొన్ని నెలలు సినిమాలకు దూరం కానున్న నవీన్ పొలిశెట్టి.. కారణమిదే..?
జాతి రత్నాలు మూవీతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty).
- By Gopichand Published Date - 02:44 PM, Wed - 17 July 24

Naveen Polishetty: జాతి రత్నాలు మూవీతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అమెరికాలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయని, చేయి విరిగినట్లు సమాచారం అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అటు మూవీ యూనిట్ కానీ ఇటు హీరో నవీన్ కానీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ వార్తలపై హీరో నవీన్ పోలిశెట్టి ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదిక స్పందించారు.
Life update. Have unfortunately suffered severe multiple fractures in my hand 💔 and injured my leg too 🙁 It’s been very tough but working towards full recovery so I can perform at my energetic best for you. Your support, patience and love is the only medicine I need ❤️… pic.twitter.com/IY0cYiAuDU
— Naveen Polishetty (@NaveenPolishety) July 17, 2024
అయితే తాజాగా నవీన్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఏం రాశాడంటే.. నా జీవితంలో ఏం జరుగుతోందో అనే అప్డేట్‌ను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఓ సినిమా షూటింగ్‌లో అనుకోకుండా నా కుడి చేతికి చాలా గాయాలు అయ్యాయి. దాంతో పాటే నా కుడి కాలుకి కూడా గాయమైంది. ప్రస్తుతం గాయాల తీవ్రత ఎక్కువగా ఉంది. వాటిని వచ్చే నొప్పి భరించలేకపోతున్నాను. అయితే గాయాల కారణంగా నేను ప్రకటించిన సినిమాలు మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కోలుకోవటానికి చాలా సమయం పట్టేలా ఉంది. అయితే త్వరగా రికవరీ అవ్వటానికి వైద్యుల సాయం తీసుకుంటున్నాను. అయితే కోలుకున్నాక మాత్రం నా ఎనర్జీ బెస్ట్ మీకు అందిస్తాను. అలాగే గతంలో లేనంత యాక్టివ్‌గా, బలంగా మీ ముందుకు తిరిగి రావాలని చూస్తున్నాను. ఇట్లు మీ జానీ జిగర్ నవీన్ పోలిశెట్టి అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సైతం నవీన్ అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ట్వీట్లు చేస్తున్నారు. సినిమాలు లేట్ అయినా పర్లేదు కానీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు.
Also Read: BJP CMs Meeting: బీజేపీ క్రాస్ ఎగ్జామినేషన్.. వైఫల్యాలపై మోడీ, షా
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులకు సైన్ చేశాడు. వాటిని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.