Nandamuri Taraka Ramarao : తాత పేరు నిలబెట్టాలి అంటూ మనవడికి భువనేశ్వరి ఆశీర్వాదం
Nandamuri Taraka Ramarao : నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆయనకు తొలి ఆశీర్వాదం పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి
- Author : Sudheer
Date : 12-05-2025 - 5:20 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao). ఈయన వంశం నుండి ఎంతో మంది చిత్ర సీమకు పరిచయమయ్యారు. తాజాగా నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆయనకు తొలి ఆశీర్వాదం పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి. తొలిసారి తారక రామారావు నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రారంభానికి క్లాప్ కొట్టి ఆశీర్వదించారు.
Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. తారకరామారావు తన చేతి ముద్దగా పెరిగిన మనవడని పేర్కొన్నారు. చిన్నప్పటి నుండి తాను చూసిన తారక రామారావు ఇప్పుడు హీరోగా మారుతుండటం తనకు గర్వకారణమని అన్నారు. “మా నాన్నలాగే ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందాలి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా” అంటూ తన ఆశయాలను వెల్లడించారు. తన తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదించారు.
Indian Army On Virat Kohli: టెస్టులకు విరాట్ గుడ్ బై.. స్పందించిన భారత డీజీఎంఏ!
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి రూపొందిస్తున్నారు. ‘న్యూ టాలెంట్ రోర్స్’ బ్యానర్‌పై చౌదరి సతీమణి గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్‌కు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యంగా గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి వంటి ప్రముఖులు ఈ ప్రారంభ వేడుకకు వచ్చి తారకరామారావుకి మద్దతు తెలిపారు. భువనేశ్వరి క్లాప్ కొట్టడం విశేషంగా మారింది.