Devi Sri Prasad : తండేల్ తో మరోసారి దేవి మార్క్..!
సినిమాలన్నీ కూడా కుదిరితే థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇద్దరు ఎవరికి వారు ది బెస్ట్ మ్యూజిక్ అందిస్తూ సినిమాను
- By Ramesh Published Date - 09:45 PM, Mon - 5 August 24

Devi Sri Prasad సినిమాలకు మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అన్నది కొన్ని సినిమాల ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. సినిమా అప్పీల్ ను మరింత హైలెట్ చేస్తూ ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం సినిమాలన్నీ కూడా కుదిరితే థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇద్దరు ఎవరికి వారు ది బెస్ట్ మ్యూజిక్ అందిస్తూ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెడుతున్నారు.
ఐతే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం నాగ చైత్నయ నటిస్తున్న తండేల్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది.
సినిమా కంటెంట్ కి తగినట్టుగా సాంగ్స్ మాత్రమే కాదు బిజిఎం ఇవ్వడంలో కూడా దేవి అదరగొట్టేస్తాడు. తండేల్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని తెలుస్తుంది. దేవి మార్క్ మ్యూజిక్ తో దుమ్ము దులిపేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా త్వరలో రిలీజ్ కాబోతున్న సూర్య కంగువ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
ఇక ఈ సినిమాతో పాటుగా ధనుష్ కుబేర సినిమాకు కూడా దేవి సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ రాబోతున్న ఈ 3 సినిమాలతో తన సత్తా చాటతాడని అంటున్నారు. రాబోతున్న సినిమాలతో దేవి శ్రీ ప్రసాద్ కూడా అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య తండేల్ సినిమా అసలైతే ఈ డిసెంబర్ కి రిలీజ్ అనుకున్నారు కానీ డిసెంబర్ రేసులో పెద్ద సినిమాలు వస్తున్న కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్.
Also Read : Harish Shankar : రవితేజకు షాక్ ఇచ్చిన హరీష్ శంకర్..!