Raveena Tandon : రవీనా టాండన్ మద్యం తాగారా ? క్లారిటీ ఇచ్చిన పోలీసులు
నటి రవీనా టాండన్ మద్యం తాగారా ? ఆమె డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడా ?
- Author : Pasha
Date : 03-06-2024 - 1:23 IST
Published By : Hashtagu Telugu Desk
Raveena Tandon : నటి రవీనా టాండన్ మద్యం తాగారా ? ఆమె డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడా ? ఇంతకీ ముంబైలో ఏం జరిగింది ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతున్న వేళ పోలీసులు స్పందించారు. అసలేం జరిగిందో చెప్పారు. నటి రవీనా టాండన్, ఆమె డ్రైవర్‌పై దాడి జరిగిందంటూ.. మాపై దాడి చేయకండి అంటూ ఆమె విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ముంబై పోలీసులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్ చేశారనే కంప్లయింట్ ఏదీ తమకు రాలేదని స్పష్టం చేశారు. వారిపై తప్పుడు కేసు నమోదైందని.. నటి రవీనా టాండన్ మద్యం తాగలేదని పోలీసులు తేల్చి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మేం మొత్తం సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశాం. నటి రవీనా(Raveena Tandon), ఆమె డ్రైవర్‌పై కొందరు తప్పుడు కేసు పెట్టారు. కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ రివర్స్ తీసుకునే సమయంలో ఓ కుటుంబం ఆ పక్క నుంచి నడుస్తూ వెళ్తోంది. వాళ్లే కారును ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు. కారును రివర్స్ చేస్తున్నప్పుడు వెనుకకు చూసుకోవాలంటూ గొడవకు దిగారు. ఈ గొడవే పెరిగి పెద్దదయింది. ఈ క్రమంలోనే గొడవను ఆపేందుకు రవీనా కారు దిగారు. ఆ తర్వాత గొడవపడిన వ్యక్తులే పోలీసులకు ఫిర్యాాదు చేశారు’’ అని పోలీసులు వివరించారు.
Also Read : BRS Vs Congress : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా ?
1990వ దశకంలో..
1990వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రవీనా టాండన్. ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీలో ఆమె కీలకపాత్ర పోషించారు. గతంలో హీరోల రెమ్యునరేషన్‌పై రవీనా సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకప్పుడు హీరోహీరోయిన్స్ మధ్య వేతన వ్యత్యాసాలు చాలా ఎక్కువ. ఒక హీరో ఒక సినిమాకు తీసుకునే పారితోషికం హీరోయిన్స్ 15 సినిమాలకు సమానం. ఇప్పుడున్న హీరోయిన్లకు రెమ్యునరేషన్ సమానత్వం, సమాన అవకాశాల గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు హీరోయిన్స్ నిర్మాతలుగానూ మారుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పారితోషికం పెరిగింది. ఎంతో ప్రొఫెషనల్ గా పనిచేసే మార్గం దొరికింది’’ అని రవీనా టాండన్ తెలిపారు. రవీనా టాండన్ నటిస్తున్న వెల్ కమ్ 3 మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సి, దిశా పటానీ, లారా దత్తా, పరేష్ రావల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.