Dadasaheb Phalke Award : మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అక్టోబరు 8న ప్రదానం
ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను కూడా మిథున్ చక్రవర్తి (Dadasaheb Phalke Award) అందుకున్నారు.
- By Pasha Published Date - 11:09 AM, Mon - 30 September 24

Dadasaheb Phalke Award : మిథున్ చక్రవర్తి .. ఈ బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ పేరు తెలియని సినీ ప్రియులు మన దేశంలో ఉండరు. రాకెట్‌లా అదిరిపోయే డైలాగ్స్ డెలివరీ చేయడం, సూపర్ డ్యాన్సులతో అదరగొట్టడం మిథున్‌కే సాధ్యం. 2024 సంవత్సరానిగానూ మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈవిషయాన్ని ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Also Read :Fake Currency : నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.1.30 కోట్ల ఫేక్ కరెన్సీ.. బంగారం వ్యాపారికి కుచ్చుటోపీ
‘‘మిథున్ దా సినీరంగ ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిదాయకం. భారతీయ సినిమా రంగానికి చేసిన అపూర్వ సేవలకుగానూ మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ అవార్డుకు ఎంపిక చేసింది.70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వేదికగా మిథున్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రదానం చేస్తాం. అక్టోబర్ 8న ఆ వేడుక జరుగుతుంది’’ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను కూడా మిథున్ చక్రవర్తి (Dadasaheb Phalke Award) అందుకున్నారు. నటనలో తనదైన ముద్ర వేసి దేశంలో కోట్లాది మంది ప్రజల మదిని దోచిన మిథున్ ఈ అత్యున్నత పురస్కారానికి అర్హుడే అని సినీ ప్రియులు అంటున్నారు.
Also Read :KTR Vs Congress : హామీలు నెరవేర్చనందుకు రాహుల్, ప్రియాంక క్షమాపణ చెప్తారా ? : కేటీఆర్
- మిథున్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జన్మించారు.
- 1976లో తొలిసారిగా మృగయా(Mrigayaa) సినిమాలో ఆయన నటించారు. దీంతో ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది.ి.
- తహదర్ కథ (1992), స్వామి వివేకానంద (1998) సినిమాల్లో నటించినందుకు ఆయనకు మరో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించాయి.
- ఇటీవలే వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీలోనూ మిథున్ నటించారు.
- మిథున్ కుమారుడు నమషి చక్రవర్తి బ్యాడ్ బాయ్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.