Chiranjeevi Workouts for Viswambhara : ఊరకనే అవుతారా మెగాస్టార్లు.. మెగా బాసు గ్రేసు చూపించేందుకు రెడీ..!
Chiranjeevi Workouts for Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో వస్తున్న విశ్వంభర సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు నెక్స్ట్ లెవెల్
- Author : Ramesh
Date : 01-02-2024 - 12:02 IST
Published By : Hashtagu Telugu Desk
Chiranjeevi Workouts for Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో వస్తున్న విశ్వంభర సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ లో కనిపిస్తారని తెలుస్తుంది. అయితే చిరు ఈ సినిమా కోసం వర్క్ అవుట్స్ మొదలు పెట్టారు. 68 ఏళ్ల చిరు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో యంగ్ గా కనిపించేందుకు కృషి చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ క్రమంలో జిం వర్క్ అవుట్స్ చేస్తున్నారు. ఇదో విధంగా మెగాస్టార్ డెడికేషన్ కి నిదర్శనమని చెప్పొచ్చు. తన జిం వర్క్ అవుట్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరు గేరింగ్ ఉప్ అండ్ రోరింగ్ టు విశ్వంభర అని కామెంట్ చేశారు.
చిరు ఈ ఏజ్ లో ఈ రేంజ్ రిస్క్ చేయడం మెగా ఫ్యాన్స్ ని కూడా సర్ ప్రైజ్ అనిపించింది. చిరు రీ ఎంట్రీ తర్వాత ఒకేరకమైన కథలు చేస్తునారని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ భోళా శంకర్ సినిమా అయితే మరీ దారుణంగా ట్రోల్ మెటీరియల్ అయ్యింది. ఈ క్రమంలో చిరు విశ్వంభరతో మరోసారి తన వర్సటాలిటీ చూపించాలని చూస్తున్నాడు.
బింబిసారతో సత్తా చాటిన వశిష్ట విశ్వంభర సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట. చిరు సరసన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించనుంది. సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. చిరు 156గా వస్తున్న ఈ విశ్వంభర మెగా ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు.
Also Read : Aashika Ranganath : ఆషిక రంగనాథ్ ఆ విషయంలో చాలా సీరియస్ అట..!