Aashika Ranganath : ఆషిక రంగనాథ్ ఆ విషయంలో చాలా సీరియస్ అట..!
కన్నడ భామ ఆషిక రంగనాథ్ (Aashika Ranganath) తెలుగులో మొదటి సినిమా సక్సెస్ అందుకోలేకపోయినా మలి చిత్రం సూపర్ హిట్ అందుకుంది. కింగ్ నాగార్జునతో నా సామిరంగ
- By Ramesh Published Date - 11:26 AM, Thu - 1 February 24

కన్నడ భామ ఆషిక రంగనాథ్ (Aashika Ranganath) తెలుగులో మొదటి సినిమా సక్సెస్ అందుకోలేకపోయినా మలి చిత్రం సూపర్ హిట్ అందుకుంది. కింగ్ నాగార్జునతో నా సామిరంగ అంటూ వచ్చిన అమ్మడు ఆ సినిమాతో క్రేజీ హిట్ అందుకుంది. సినిమా చూసిన ఆడియన్స్ అంతా కన్నడ భామ ఆషిక రంగనాథ్ ప్రేమలో పడ్డారు. సినిమాలో వరాలు పాత్రకి ఆమె పర్ఫెక్ట్ అనిపించింది. అంతేకాదు ఆ పాత్రకు తగిన అభినయంతో ఆమె మెప్పించింది. తెలుగు ఆడియన్స్ ఒక్కసారి అభిమానించడం మొదలు పెడితే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది.
We’re now on WhatsApp : Click to Join
ఆషిక రంగనాథ్ కి కూడా అంతే. నా సామిరంగ హిట్ అయిన దగ్గర నుంచి ఆమె లెవెల్ మారిపోయింది. ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. అంతేకాదు వరుస అవకాశాలు కూడా వచ్చేస్తున్నాయి. బడా నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారట. అయితే అమ్మడు మాత్రం కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకుందట. కథల విషయంలో చాలా ఫోక గా ఉంటుందట. మొహమాటానికి పోయి వచ్చిన ప్రతి ఆఫర్ చేయకూడదని ఫిక్స్ అయ్యిందట. అందుకే నా సామిరంగ సెట్స్ మీద ఉండగానే పోస్టర్స్ రిలీజ్ చేయగా ఆ టైం లో ఒకటి రెండు తెలుగు ఆఫర్లు వచ్చినా కాదనేసిందట.
ఇప్పుడు సినిమా హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా ఆఫర్లు పలకరిస్తున్నాయట. కానీ ఆషిక మాత్రం అందుకు నో అంటుందట. ఆషిక రంగనాథ్ తెలుగులో వరుస సినిమాలు చేయాలని అనుకుంటుంది. కానీ కథాబలం ఉన్న సినిమాలే చేస్తానని అంటుంది. అంతేకాదు సినిమాలో తన పాత్రకు ఏమాత్రం ఇంపార్టెంట్ లేకపోయినా సరే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందట.
ఆషిక రంగనాథ్ ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉంటుందని తెలుస్తుంది. తెలుగులో ఆఫర్లు రావడమే గొప్ప అనుకుంటున్న హీరోయిన్స్ కొంతమంది ఉండగా సరైన సబ్జెక్ట్ అయితేనే చేస్తానని చెప్పే ఆషిక లాంటి వారికి కూడా డిమాండ్ ఎక్కువే. మరి అమ్మడు తన తర్వాత సినిమా ఏ హీరోతో చేస్తుందో చూడాలి.
Also Read : Mrunal Thakur : ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఆ టాలెంట్ చూపించబోతుందా..?