Lavanya Tripathi : మెగా కోడలు వాటికి మాత్రమే..!
Lavanya Tripathi మొన్నటిదాకా హీరోయిన్ గా మాత్రమే ఉన్న లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడి మెగా కోడలిగా మారింది. కెరీర్ అంతంత మాత్రంగానే
- Author : Ramesh
Date : 16-06-2024 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
Lavanya Tripathi మొన్నటిదాకా హీరోయిన్ గా మాత్రమే ఉన్న లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పెళ్లాడి మెగా కోడలిగా మారింది. కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్న లావణ్య ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలను పూర్తిగా మానేసి ఫ్యామిలీని చూసుకుంటుందని అనుకున్నారు. కానీ లావణ్య ప్లాన్స్ వేరేలా ఉన్నాయని తెలుస్తుంది. సినిమాల విషయంలో వరుణ్ అండ్ ఫ్యామిలీ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని అంటున్న లావణ్య త్రిపాఠి తనకు నచ్చిన కథ వస్తే తప్పకుండా చేస్తానని అంటుంది.
ఐతే సినిమాల కన్నా వెబ్ సీరీస్ లపై ఎక్కువ దృష్టి పెడతా అంటుంది మెగా కోడలు లావణ్య. సినిమాలైతే హీరో, హీరోయిన్, పాటలు ఉంటాయి కానీ వెబ్ సీరీస్ లో అలాంటివి ఉండవు. అక్కడ కథే హీరో మిగతా వారంతా పాత్రదారులే అందుకే వెబ్ సీరీస్ లపైన తన స్పెషల్ ఫోకస్ అంటుంది లావణ్య.
ఇప్పటికే లావణ్య త్రిపాఠి వెబ్ సీరీస్ లో నటించింది. ఇక మీదట వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అంటుంది. సినిమాల్లో అవకాశం వచ్చినా తను కోరినట్టుగా కథ ఉండాలని అంటుంది అమ్మడు. మొత్తానికి పెళ్లి తర్వాత లావణ్య తన సినిమాల సెలక్షన్స్ లో మార్పులు వచ్చాయని అర్ధమవుతుంది.
Also Read : Allu Aravind : పుష్ప 2.. అల్లు అరవింద్ అలా చేస్తే మాత్రం..!