Allu Aravind : పుష్ప 2.. అల్లు అరవింద్ అలా చేస్తే మాత్రం..!
Allu Aravind పుష్ప 2 సినిమాను మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా బాయ్ కాట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ ఎలక్షన్స్ టైం లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్
- Author : Ramesh
Date : 16-06-2024 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Aravind పుష్ప 2 సినిమాను మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా బాయ్ కాట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ ఎలక్షన్స్ టైం లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కాదని తన స్నేహితుడు శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లడం పెద్ద దుమారాన్నే రేపింది. మోరల్ గా తన సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి తెలిపినట్టుగా ట్వీట్ వేసి ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లాడు అల్లు అర్జున్.
ఐతే ఈ విషయంపై నాగ బాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మనవాడు, పరాయివాడు అనుకుంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టడం ఆ తర్వాత డిలీట్ చేయడం జరిగింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఫైట్ జరుగుతుంది. ఐతే ఈ గొడవ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.
అంతేకాదు అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 మీద కూడా ఈ గొడవ ప్రభావం ఉండేలా ఉంది. ఐతే దీన్ని బ్యాలెన్స్ చేసేలా అల్లు అరవింద్ రంగంలోకి దిగుతున్నాడని టాక్. మెగాస్టార్ చిరంజీవిని కూల్ చేసి అల్లు అర్జున్ సినిమాకు చిరంజీవిని గెస్ట్ గా రప్పించే ప్లాన్ లో ఉన్నాడట. అంతేకాదు కుదిరితే పవన్ కళ్యాణ్ ని కూడా పుష్ప 2 ఈవెంట్ కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
మెగా వర్సెస్ అల్లు గొడవలు ప్రస్తుతానికి ఆదిలోనే ఉన్నాయి ఇవి పెరిగి పెద్దవి అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అరవింద్ మీద ఉంది. అందుకే తన జోక్యంతో సమస్యని కాస్త తగ్గించేలా చేస్తున్నారట. మరి అల్లు అరవింద్ పిలవగానే చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గానీ వస్తారా లేదా అన్నది చూడాలి. వాళ్లిద్దరిలో ఎవరో ఒకరు వచ్చినా ఈ ప్రాబ్లెం కి ఫుల్ స్టాప్ పడ్డట్టే.. రాకపోతే మాత్రం సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది.