Mega Heroes : డిసెంబర్ లో మెగా ఫ్యాన్స్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో..?
అక్టోబర్ లో ఉండాల్సిన సినిమాల ఫైట్ అంతా కూడా ఇప్పుడు డిసెంబర్ కి షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలన్నీ కూడా డిసెంబర్ టార్గెట్ గా రిలీజ్ డేట్ లు ఎనౌన్స్
- By Ramesh Published Date - 07:12 AM, Tue - 23 July 24

టాలీవుడ్ అడియన్స్ కు సినిమాల పండగ రాబోతుంది. ఈసారి దసరాకి ఏ సినిమాలు వస్తాయన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. రేసులో మొన్నటిదాకా ఉన్న దేవర కూడా సెప్టెంబర్ కి వచ్చింది. ఐతే అక్టోబర్ లో ఉండాల్సిన సినిమాల ఫైట్ అంతా కూడా ఇప్పుడు డిసెంబర్ కి షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలన్నీ కూడా డిసెంబర్ టార్గెట్ గా రిలీజ్ డేట్ లు ఎనౌన్స్ చేస్తున్నారు. పుష్పతో మొదలు పెట్టి లేటెస్ట్ గా గేమ్ చేంజర్ సినిమా కూడా డిసెంబర్ రిలీజ్ అంటున్నారు.
పుష్ప 2 సినిమా అసలైతే ఆగష్టు 15న రావాల్సింది. కానీ సినిమా పూర్తి చేయడానికి తనకు ఇంకా కొంత టైం కావాలని చెప్పాడు సుకుమార్ (Sukumar). చేసేదేమి లేక హీరో, నిర్మాతలు ఆయన మాటకు విలువ ఇచ్చి సినిమాను డిసెంబర్ 6కి వాయిద వేశారు. ఐతే ఇంకా 30 రోజుల దాకా షూటింగ్ ఉండగా హీరో, డైరెక్టర్ ఇద్దరు ఫారిన్ ట్రిప్స్ వేస్తున్నారు.
ఇక డిసెంబర్ చివర్లో అంటే క్రిస్మస్ రేసులో రాం చరణ్ గేమ్ చేంజర్ (Ram Charan Game Changer) రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు లేటెస్ట్ గా వెల్లడించారు. సో డిసెంబర్ మొదట్లో అల్లు అర్జున్, చివర్లో చరణ్ అదరగొట్టబోతున్నారు. పుష్ప 2, గేమ్ చేంజర్ రెండు డిఫరెంట్ సినిమాలు. మెగా ఫ్యాన్స్ (Mega Fans) రెండిటిని కూడా ఆదరించే ఛాన్స్ ఉంది. ఐతే ఏపీ ఎలక్షన్ టైం లో తన ఫ్రెండ్ కోసం ప్రచారం చేసిన విషయంలో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు.
మరి రిలీజ్ టైం కు అన్ని సర్ధుకుంటాయా లేదా అన్నది చూడాలి. చిరుని పుష్ప 2 (Allu Arjun Pushpa 2) ఈవెంట్ కి తెచ్చి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని ప్లాన్. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఐతే సగటు మెగా ఫ్యాన్ మాత్రం అటు అల్లు అర్జున్, ఇటు చరణ్ సినిమాలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు.
Also Read : Janhvi Kapoor : దేవర గురించి జాన్వి చెబుతున్న ముచ్చట్లు..!