Janhvi Kapoor : దేవర గురించి జాన్వి చెబుతున్న ముచ్చట్లు..!
ఇప్పటికే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న జాన్వి కపూర్ సౌత్ ఇండస్ట్రీకి దేవరతోనే వస్తుంది. ఐతే ఈ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆమె అన్నది.
- By Ramesh Published Date - 05:40 AM, Tue - 23 July 24

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్ బ్యానర్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే దేవర సినిమా ముందు ఒక సినిమాగా అనుకున్నా కథ పాత్రలు బాగా కుదరడంతో రెండు భాగాలుగా వదులుతున్నారు. ఎన్.టి.ఆర్ దేవర సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వి కపూర్ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న జాన్వి కపూర్ సౌత్ ఇండస్ట్రీకి దేవరతోనే వస్తుంది. ఐతే ఈ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆమె అన్నది. అంతేకాదు దేవర (NTR Devara) లో తన పాత్ర చాలా బాగుంటుందని అంటుంది. దేవర పార్ట్ 1 లో కన్నా పార్ట్ 2 లో పాత్ర మరింత స్కోప్ ఉంటుందని చెప్పుకొచ్చింది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ దేవర గురించి చేసిన ఈ కామెంట్స్ తారక్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఐతే దేవర తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జాన్వి కపూర్ (Janhvi Kapoor) ఆ సినిమా రిలీజ్ కాకుండానే చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుంది.
జాన్వి కపూర్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్టార్స్ తో నటిస్తుంది. దేవర హిట్ పడింది అంటే మాత్రం అమ్మడికి సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ (Tollywood) లో కూడా క్రేజ్ పెరిగినట్టే లెక్క. దేవర సినిమా నుంచి ఆమధ్య వదిలిన పోస్టర్ లో జాన్వి హాఫ్ శారీలో అదరగొట్టేసింది. మరి దేవరతో అమ్మడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
Also Read : Karthi : అన్న సినిమాలో తమ్ముడు.. సీక్రెట్ గా ఉంచాల్సింది కానీ..?