Manchu Vishnu Kannappa : కన్నప్ప రిలీజ్.. మంచు హీరో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు..?
Manchu Vishnu Kannappa భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా టీజర్ చాలా ట్రోల్స్ కి గురైంది. అందుకే ఈసారి రిలీజ్ చేసే ప్రచార చిత్రం పర్ఫెక్ట్ గా ఉండాలని మేకర్స్ ప్లాన్
- By Ramesh Published Date - 02:25 PM, Sat - 2 November 24

మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ తర్వాత మళ్లీ ఎలాంటి సౌండ్ చేయట్లేదు. సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఆమధ్య చర్చ జరిగింది. మరి అది ఏమైందో ఏమో కానీ కన్నప్ప రిలీజ్ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. అంతేకాదు దసరా, దీపావళి లాంటి పెద్ద పండగలు వచ్చినా కూడా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
మంచు విష్ణు (Manchu Vishnu) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా టీజర్ చాలా ట్రోల్స్ కి గురైంది. అందుకే ఈసారి రిలీజ్ చేసే ప్రచార చిత్రం పర్ఫెక్ట్ గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే సినిమా రిలీజ్ ఎప్పుడన్న క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. అసలు కన్నప్ప షూటింగ్ ఎంతవరకు వచ్చింది. సడెన్ గా మంచు విష్ణు ఇలా సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లాడన్నది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా లెవెల్..
కన్నప్ప (Kannappa) సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ భాగం అవుతున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే కన్నప్ప రిలీజ్ ప్రకటించకపోవడానికి సినిమా బిజినెస్ జరగక పోవడం కూడా ఒక రీజన్ అని అంటున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప సినిమా డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తే ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. సో సినిమా ఈ ఇయర్ రాకపోవచ్చనే ఫిక్స్ అవ్వొచ్చు.
Also Read : Allu Arjun : అల్లు వారసుడు ప్రభాస్ ఫ్యానా..?