Manchu Lakshmi: ప్రణీత్ పై మంచు లక్ష్మి షాకింగ్ వ్యాఖ్యలు.. నడిరోడ్డుపై నరకాలి అంటూ కామెంట్స్.. వీడియో..!
ఈ క్రమంలోనే తాజాగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఓ ఈవెంట్‌లో ఈ విషయమై స్పందించారు.
- By Gopichand Published Date - 10:31 AM, Wed - 10 July 24

Manchu Lakshmi: ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు తీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ప్రణీత్ హనుమంతు చేస్తున్న కామెంట్స్ పట్ల చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సదరు యూట్యూబర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రణీత్ హనుమంతుపై సినీ తారలు సైతం తమ గొంతును వినిపిస్తున్నారు. ప్రణీత్‌కు కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఓ ఈవెంట్‌లో ఈ విషయమై స్పందించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మంచు లక్ష్మి ఏం మాట్లాడారంటే.. హనుమంతు అని కాంట్రవర్శీ ఒక్కటి నడుస్తుంది మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు ఒక చిన్నపాపను అబ్యూస్ చేసి చైల్డ్ అబ్యూస్ ట్రోలర్స్ రోస్టర్స్ అని చెప్పేసి హనుమంతు అనే ఒక ఛానల్ వాళ్లు ఏమండీ నాకు బాధేస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇంత నెగిటివిటీతో కూడా ఉన్నారా అని బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్లకి రోటీ కపడా మక్కాన్ ఈ మూడు ఉంటే వాళ్లు ఇలా చేయరేమో అని థంబ్ యూట్యూబ్‌లో థంబ్‌నైల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటే నిన్న ఇక్కడ ఇలా ఇలా చేశావు అంటాది అమ్మో నేను నీ దగ్గరే ఉన్నాను కదే అవును కదా కానీ ఇలా ఎందుకు రాశారు ఐ సేడ్ ఫస్ట్ నువ్వు చూడటం మానేయ్ బట్ చూడటం మానేయం కుదరదు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి బీకాజ్ డిజిటల్ మీడియా అందులో అందరూ నేర్చుకుంటున్నారు ఎవరూ ఎంత సెన్సేషనల్‌గా పెడితే లక్ష్మి మంచు స్లాప్పింగ్ సమ్‌బడీ అని ఉంది యూట్యూబ్‌లో అది మీరు క్లిక్ చేస్తే నేను మేజర్ చంద్రకాంత్‌కు క్లాప్ కొడుతున్నాను దానికి స్లాప్ కి క్లాప్‌కి తేడా తెలియని వాళ్లతో డిస్కషన్ ఎలా చేయాలండీ అని కామెంట్ చేశారు.
Also Read: 3 Lakh Dog Bites : పదేళ్లలో 3,36,767 మందిని కరిచిన కుక్కలు.. సంచలన నివేదిక
ఇలాంటి వాళ్ల బహిరంగంగా నరకాలి.. ప్రణీత్ హనుమంతుపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం!#ManchuLakshmi #LakshmiManchu pic.twitter.com/eJ0bxKBVF2
— Filmy Focus (@FilmyFocus) July 9, 2024
ఈ క్రమంలోనే ఆమె ఇంకా మాట్లాడుతూ.. చైల్డ్ అబ్యూజ్ చేసినవాళ్లని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనం మనమే సెల్ప్ గవర్నింగ్ చేస్తున్నామండి ఆ నేను సినిమా చేసేటప్పుడు పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను ఆట్‌లీస్ట్ ఆడ్ 600 మనుషులకి ఒక్క పోలీస్ ఆఫీసర్ అంటా ఒక ఆరు వేల మంది గానీ బయటికి వెళ్లిపోతే మనం ఏం అయిపోతామండి మనల్ని మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి సో ఇలా తప్పు చేసిన వాళ్లు ఏవరో ఒక్కరూ ఆవును తిన్నారు అనో ఎవరో ఒక్కరూ హిజబ్ వేసుకున్నారనో ఎవరో ఒక్కరూ మతాన్ని కరెప్ట్ చేస్తున్నారో అని బాధపడమకండి ఒక మనిషిని ఒక మనిషిగా చూడనప్పుడే వాళ్లని నిందించాలని నేను అంటున్నాను అని మంచు లక్ష్మి కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join.