Lakshmi Manchu: శ్రీదేవిని అలా చూసినప్పటి నుంచి నా మనసు మార్చుకున్నాను.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!
తాజాగా మంచు లక్ష్మి ఒక షోలో భాగంగా ఫిట్నెస్ విషయం గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో తన మనసును మార్చుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
- By Anshu Published Date - 10:33 AM, Mon - 24 February 25

తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు లక్ష్మి తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఈమె ఎక్కువగా సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ తో బాగా వైరల్ అయింది. ఎక్కువగా ఆమె మాట్లాడే తెలుగు గురించి రూల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది మంచు లక్ష్మి.
ఇది ఇలా ఉంటే మంచు లక్ష్మి తాజాగా ఆమె చేసే బ్యూటీ విత్ లక్ష్మి టాక్ షో కు బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ భార్య మహీపా కపూర్ హాజరైంది. వీరిద్దరూ అందం, ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఒకసారి జిమ్ లో చూశాను. తను ట్రెడ్‌మిల్ పై పరిగెడుతోంది. అప్పుడు జిమ్ లోపలికి అడుగుపెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాను. శ్రీదేవి తన జుట్టుకు ఒత్తుగా నూనె పట్టించి ఉంది. అది చూసి షాకయ్యాను.
దక్షిణ భారతదేశంలో తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా సాధారణ విషయం. ఎందుకో కానీ, జుట్టుకు నూనె పెట్టుకోవడాన్ని నేనసలు ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడైతే శ్రీదేవిని అలా చూశానో సడన్ గా నా మనసు మారిపోయింది. అంత గొప్ప నటి శ్రీదేవియే జుట్టుకు నూనె రాసుకుందంటే చాలా గొప్ప విషయం అనిపించింది. తనెప్పుడూ సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుంది అని చెప్పుకొచ్చింది. అలా శ్రీదేవిని చూసి తన మనసును మార్చుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా ఈ షోలో భాగంగా లక్ష్మి చేసిన వాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.