Ms. Ilayaa : మిస్ ఇళయా.. కొత్త సినిమా ఓపెనింగ్..
నేడు పూజా కార్యక్రమాలతో కొత్త సినిమా ప్రారంభమైంది.
- By News Desk Published Date - 08:49 PM, Sat - 8 February 25

Ms. Ilayaa : తాజాగా ఓ కొత్త సినిమా ఓపెనింగ్ అయింది. కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్ పై కుషాల్ జాన్ హీరోగా వేముల జి దర్శకత్వంలో మట్టా శ్రీనివాస్ నిర్మాతగా, చాహితీ ప్రియా సహా నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ ఇళయా’ (Ms. ILAYAA). ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్, పలువురు సినీ పత్రముఖులు పాల్గొనగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి దింటకుర్తి మురళీ కృష్ణ పర్యవేక్షణలో పూజ కార్యక్రమం నిర్వహించారు.
మూవీ ఓపెనింగ్ సందర్భంగా హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నేను ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. నా కెరీర్‌లో ఈ పాత్ర ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుంది అని తెలిపారు. డైరెక్టర్ వేముల జి మాట్లాడుతూ.. ఈ సినిమా ఓ వినూత్నమైన కథతో రానుంది. హీరో కుషాల్ జాన్ ఈ పాత్రకు న్యాయం చేస్తారు. సినిమాని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నాము అని అన్నారు.
నిర్మాత మట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా బ్యానర్ కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ పై వస్తున్న ఈ సినిమా కోసం ఎంతో అన్వేషణ చేసి, మంచి కథను ఎంపిక చేసుకున్నాం. సినిమాకు అనుగుణంగా సాంకేతిక బృందం, నటీనటులను ఎంపిక చేసుకున్నాం. ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. మిస్ ఇళయా మొదటి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం అని తెలిపారు.
Also Read : Sikkolu In Tandel : ‘తండేల్’ ఎవరు ? సిక్కోలుతో ఉన్న సంబంధమేంటి ?