Sikkolu In Tandel : ‘తండేల్’ ఎవరు ? సిక్కోలుతో ఉన్న సంబంధమేంటి ?
తండేల్ మూవీ స్టోరీ శ్రీకాకుళం జిల్లా(Sikkolu In Tandel) ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేసం గ్రామం చుట్టూ తిరుగుతుంది.
- By Pasha Published Date - 07:52 PM, Sat - 8 February 25

Sikkolu In Tandel : నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ సినిమా స్టోరీపై తెలుగు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లు బాగా చర్చించుకుంటున్నారు. ‘తండేల్’ పదం గురించి సైతం డిస్కషన్ నడుస్తోంది. ఈ వివరాలను తెలుసుకునేందుకు చాలామంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మనం ‘తండేల్’ మూవీ స్టోరీ, ‘తండేల్’ పదానికి సంబంధించిన వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Maaya Rajeshwaran : రైజింగ్ టెన్నిస్ స్టార్ మాయా రాజేశ్వరణ్.. ఎవరామె ?
తండేల్ ఎవరు ? ఏం చేస్తాడు ?
- ‘తండేల్’ అనేది మన తెలుగు పదం కాదు. అది గుజరాతీ పదం.
- తండేల్ పదాన్ని గుజరాత్‌లోని మత్స్యకారులు వాడుతుంటారు.
- ‘తండేల్’ అంటే ‘లీడర్’ అని అర్థం. బోటుకు కెప్టెన్‌గా ఉండేవాడిని తండేల్ అని పిలుస్తారు.
- చేపల వేటకు వెళ్లే బోటులో చాలామంది జాలర్లు ఉంటారు. వాళ్లకు లీడర్‌గా ఉండే వ్యక్తిని తండేల్ అంటారు.
- శ్రీకాకుళం జిల్లాలోని సిక్కోలు ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఏడాదిలో తొమ్మిది నెలల పాటు చేపల వేటకు వెళ్తుంటారు. గుజరాత్ తీరం దాకా వెళ్లి వాళ్లు చేపల వేట చేస్తారు. అక్కడికి వెళ్లిన ఎంతోమంది సిక్కోలు మత్స్యకారులకు పరిచయమైన గుజరాతీ పదమే ‘తండేల్’.
Also Read :BJPs Capital Gain : నిర్మల ‘సున్నా ట్యాక్స్’ సునామీ.. ఆప్ ఢమాల్
‘తండేల్’లోని రియల్ స్టోరీ ఇదీ..
తండేల్ సినిమాలో ఉన్నది రియల్ స్టోరీ. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు 2018 సంవత్సరం నవంబరు 31న నాలుగు బోట్లలో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతంలో చేపల వేట చేయాలనేది వీరి టార్గెట్. అయితే పొరపాటున మూడు బోట్లు అరేబియా మహాసముద్రంలోని పాకిస్తాన్‌కు చెందిన సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాయి. దీంతో పాకిస్తాన్ కోస్ట్ గార్డు సిబ్బంది ఆ బోట్లను చుట్టుముడుతారు. అందులోని సిక్కోలు మత్స్యకారులను అదుపులోకి తీసుకుంటారు. మరో సిక్కోలు బోటులో ఉన్న మత్స్యకారులు ఈ విషయాన్ని బాధిత మత్స్యకారుల కుటుంబీకులకు తెలియజేస్తారు. దీంతో ఆనాటి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తుంది. దీనిపై నాటి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. చివరకు 2020 జనవరి 6న పాకిస్తాన్ చెర నుంచి సిక్కోలు మత్స్యకారులు రిలీజ్ అవుతారు. తండేల్ మూవీ స్టోరీ శ్రీకాకుళం జిల్లా(Sikkolu In Tandel) ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేసం గ్రామం చుట్టూ తిరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా యాసలో చక్కటి డైలాగ్‌లతో ఈ మూవీని బాగా తీశారు.