Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
KTR First Reaction on Allu Arjun Arrest : అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు
- By Sudheer Published Date - 02:08 PM, Fri - 13 December 24

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీతపై ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం పాలకుల అశ్రద్ధకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్‌ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అరెస్ట్ ప్రక్రియపై ఆయన ఇలా సూటిగా స్పందించడంతో ప్రభుత్వం వైఖరిపై చర్చ మొదలైంది. సినీ పరిశ్రమలోనూ ఆయన వ్యాఖ్యలకు మద్దతు వ్యక్తమవుతోంది. ఇకపోతే, కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. “న్యాయానికి పోరాడే వ్యక్తులు ఉండడం సంతోషకరం” అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa
— KTR (@KTRBRS) December 13, 2024
ప్రస్తుతం అల్లు అర్జున్ను (Allu Arjun) పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి (Gandhi hospital ) తరలించారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఉస్మానియా ఆస్పత్రిలో అల్లు అర్జున్ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీక్షించి, తగిన నివేదిక సిద్ధం చేయనున్నారు. అరెస్టు సమయంలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించడం న్యాయపరమైన విధిగా ఉండటంతో, ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆస్పత్రికి చేరుకున్న సమాచారం తెలియగానే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ అరెస్టు, వైద్య పరీక్షలు, కోర్టు విచారణ వంటి పరిణామాలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి తన వాదనను కోర్టులో ఎలా చెప్పుకుంటారు..? జడ్జ్ ఏ విధంగా స్పందిస్తారు..? ఒకవేళ రిమాండ్ కు తరలిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉందా..? అనేది ఆసక్తి రేపుతోంది.
Read Also : Discovery Lookback 2024 : ఈ సంవత్సరం భారతీయులు ఎక్కువగా శోధించిన టాప్ 10 వంటకాలు ఇవే..!