Krithi Sanon Dating : 10 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్.. ప్రభాస్ తో లవ్ స్టోరీ అని ఇప్పుడు ఇలా ఏంటి..?
Krithi Sanon Dating బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కృతి సనన్ కెరీర్ మొదట్లో ఆమెను విమర్శించిన వారిని సైతం ఆశ్ఛర్యపరచి సూపర్ అనిపించుకునేలా చేసుకుంది.
- By Ramesh Published Date - 11:30 AM, Mon - 25 March 24

Krithi Sanon Dating బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కృతి సనన్ కెరీర్ మొదట్లో ఆమెను విమర్శించిన వారిని సైతం ఆశ్ఛర్యపరచి సూపర్ అనిపించుకునేలా చేసుకుంది. తెలుగులో 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన కృతి సనన్ నాగ చైతన్యతో దోచెయ్ సినిమా కూడా చేసింది. బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది.
ఆ సినిమా టైం లో ప్రభాస్ తో కృతి సనన్ లవ్ స్టోరీ నడిపించిందని వార్తలు వచ్చాయి. ప్రభాస్ కూడా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నప్పుడు బాలకృష్ణ కూడా గుచ్చి గుచ్చి మరీ కృతి సనన్ గురించి అడిగారు. ఐతే ఆ తర్వాత వీళ్లిదరి మధ్య ఏం లేదని తెలిసింది. ఇదిలాఉంటే కృతి సనన్ ప్రస్తుతం ఒక బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉందని ముంబై మీడియా కోడై కూస్తుంది.
రీసెంట్ గా వెకేషన్ కు లండన్ వెళ్లి అమ్మడు అక్కడ ఒక వ్యక్తితో చెట్టా పట్టాలేసుకుని తిరిగింది. అతనే కృతి సనన్ బోయ్ ఫ్రెండ్ అని అంటున్నారు. ఇంతకీ అతనెవరు అంటే బిజినెస్ మెన్ కబీర్ బహియా అని తెలుస్తుంది. అతని వయసు 23 ఏళ్లే అని టాక్. కృతి సనన్ వయసు 33 ఏళ్లు. అంటే తన కన్నా 10 ఏళ్ల చిన్నోడితో కృతి సనన్ డేటింగ్ లో ఉంది. హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా వారి లవ్ స్టోరీస్ నడిపిస్తుంటారు. ప్రియాంక చోప్రా తనకన్నా చిన్నోడైన నిక్ జోనస్ ని పెళ్లాడింది. మలైకా కూడా అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది.
సో కృతి సనన్ వారి దారిలోనే తన కన్నా 10 ఏళ్లు చిన్నోడితో లవ్ స్టోరీ నడిపిస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది తెలియదు కానీ కృతి డేటింగ్ వార్తలతో బాలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది.
Also Read : Kamal Hassan : కమల్ కామెంట్స్ పై ఆలోచనలో పడ్డ రెబల్ స్టార్ ఫ్యాన్స్.. కల్కి ఏం జరుగుతుంది..?