Devara 2 : ఇప్పటి నుండే దేవర 2 పై అంచనాలు పెంచేస్తున్న కొరటాల
Devara 2 : 'దేవర-1' పోలిస్తే పార్ట్-2 మరింత భారీగా ఉండబోతుందని శివ చెప్పుకొచ్చారు
- By Sudheer Published Date - 07:00 AM, Tue - 8 October 24

దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడం తో..దేవర 2 (Devara 2) పై అంచనాలు పెంచే ప్రయత్నం డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటి నుండే మొదలుపెట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద దేవర (Devara) వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన మూవీ దేవర. ఎన్టీఆర్ – కొరటాల శివ (NTR – Koratala Shiva) కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి.
తారక్ తో జాన్వి కపూర్ జత కట్టగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. కానీ శివ ఆ అంచనాలను అందుకోలేకపోయాడని , కథ , కథనం బాగాలేదని , జాన్వీ రోల్ కూడా పెద్దగా లేదని అంత విమర్శలు చేసారు. కానీ ఆ విమర్శలు సినిమా కలెక్షన్లను ఆపలేకపోయాయి. టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. ముఖ్యంగా దసరా సెలవులు ఉండడం తో థియేటర్స్ జనాలతో కళాకలాడుతున్నాయి. ఈ చిత్రానికి పది రోజుల్లో రూ.466 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇదిలా ఉంటె పార్ట్ 1 కు అద్భుతమైన స్పందన వస్తుండడం తో పార్ట్ 2 పై శివ మరింత జాగ్రత్త పడుతున్నాడు. అభిమానుల విమర్శలకు పార్ట్ 2 తో సమాధానం చెప్పేందుకు సిద్దమయ్యాడు. ‘దేవర-1’ పోలిస్తే పార్ట్-2 మరింత భారీగా ఉండబోతుందని శివ చెప్పుకొచ్చారు. ఇందులోని క్యారెక్టర్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠకు గురిచేస్తాయని , పార్ట్-2లో జాన్వీ క్యారెక్టర్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని , కథలో అసలైన మార్పు పార్ట్ 2 లోనే ఉండబోతుందని, కొన్ని ఎపిసోడ్లు మాత్రం అభిమానులకు మంచి హై ఇస్తాయని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న అభిమానులు ఇప్పటి నుండే పార్ట్ 2 పై అంచనాలు పెంచేసుకుంటున్నారు.
Read Also : Pawan Kalyan : మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్