Keerti Suresh : కీర్తి సురేష్ కాబోయే వరుడి గురించి ఈ విషయాలు తెలుసా..?
Keerti Sureshకీర్తి సురేష్ పెళ్లి చేసుకునే వ్యక్తి ఫోటోతో సహా వాళ్ల పెళ్లి డేట్ కూడా లాక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 11, 12 తేదీల్లో కీర్తి సురేష్ మ్యారేజ్ అవుతుందట. ఇంతకీ అమ్మడు పెళ్లి చేసుకునేది ఎవరిని
- By Ramesh Published Date - 12:27 PM, Wed - 20 November 24

మహానటి సినిమాతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి సురేష్ ఆ సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. కీర్తి సురేష్ ఈమధ్య సినిమాల దూకుడు తగ్గించింది. ఐతే కీర్తి సురేష్ పెళ్లిపై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐతే వాటి గురించి అమ్మడు ఎప్పుడు లైట్ తీసుకుంటూ వస్తుంది.
ఐతే లేటెస్ట్ గా కీర్తి సురేష్ పెళ్లి చేసుకునే వ్యక్తి ఫోటోతో సహా వాళ్ల పెళ్లి (Keerti Suresh Marriage) డేట్ కూడా లాక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 11, 12 తేదీల్లో కీర్తి సురేష్ మ్యారేజ్ అవుతుందట. ఇంతకీ అమ్మడు పెళ్లి చేసుకునేది ఎవరిని అంటే.. తన స్నేహితుడు ఆంటోనిని అని తెలుస్తుంది. బిజినెస్ మ్యాన్ అయిన ఆంటోని (Anthony) థట్టిల్ కీర్తి సురేష్ కు ఒకప్పటి క్లాస్ మెట్ అని తెలుస్తుంది. అతను కొన్నాళ్లు ఖతర్ లో జాబ్ చేసి వచ్చి ప్రస్తుతం కొచ్చి (Kochi)లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశాడట. దాదాపు 10 ఏళ్లుగా కీర్తి సురేష్ అతనితో ప్రేమలో ఉందని తెలుస్తుంది.
ప్రేమ పెళ్లి గురించి..
ప్రేమ పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కీర్తి సురేష్ (Keerti Suresh) మాట దాట వేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు కీర్తి పెళ్లి చేసుకునే అతని ఫోటోతో సహా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఈ వార్త విని కాస్త అప్సెట్ అవుతున్నా. ఆమె ఫ్యాన్స్ కొందరు కీర్తి పెళ్లి చేసుకుంటుందని సంతోషంగా ఉన్నారు.
పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియదు కానీ అమ్మడు మాత్రం కీర్తి పెళ్లి వార్తతో సోషల్ మీడియా అంతా హడావిడిగా ఉంది. ఐతే కీర్తి సురేష్ నుంచి మాత్రం ఈ న్యూస్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
Also Read : Ram : మహేష్ తో రామ్.. మైత్రి మెగా ప్లాన్..!