Kiara Advani : 2025 కియరా అద్వాని.. మోత మోగించేస్తుందా..?
Kiara Advani బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో అమ్మడు ఛాన్స్ అందుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ రెండు సరిపోవు అన్నట్టుగా యష్ టాక్సిక్ లో
- By Ramesh Published Date - 08:22 AM, Wed - 20 November 24

బీ టౌన్ క్రేజీ బ్యూటీ కియరా అద్వాని ఇప్పటికే అక్కడ స్టార్ డం కొనసాగిస్తుండగా సిద్ధార్థ్ తో పెళ్లి తర్వాత కాస్త వెనకపడినట్టు తెలుస్తుంది. 2023 లో కేవలం ఒకే ఒక్క సినిమాతో వచ్చిన అమ్మడు 2024లో కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. చేస్తున్న సినిమాలన్నీ సెట్స్ మీద ఉండటం విశేషం.
ప్రస్తుతం కియరా చరణ్ (Ram Charan) గేమ్ చేంజర్ (Game Changer) లో నటిస్తుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే. శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా (PAN India) లెవెల్ లో ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది. ముందు ఈ ఇయర్ డిసెంబర్ అనుకున్న ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో కియరా (Kiara Advani) బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. ఈ సినిమాతో పాటుగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ (NTR) కలిసి చేస్తున్న వార్ 2 లో కూడా కియరా నటిస్తుంది.
బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో అమ్మడు ఛాన్స్ అందుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ రెండు సరిపోవు అన్నట్టుగా యష్ టాక్సిక్ లో కూడా కియరా ఛాన్స్ పట్టేసింది. ఈ 3 సినిమాలతో కూడా కియరా మళ్లీ టాప్ లీగ్ లోకి రానుంది.
కియరా అద్వాని తిరిగి ఫాం లోకి వచ్చేందుకు ఈ సినిమాలు సపోర్ట్ చేస్తాయని చెప్పొచ్చు. కియరా తిరిగి ఫాం లోకి వస్తే మిగతా హీరోయిన్స్ కి టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు.
Also Read : Viswak Sen : విజయ్ సేతుపతి మహారాజపై విశ్వక్ సేన్ కామెంట్..!