Devara 2 : దేవర 2 ఉంటుంది.. కానీ ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
అందరూ దేవర 2 ఉంటుందని చెప్తున్నారు కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పట్లేదు.
- By News Desk Published Date - 08:40 AM, Tue - 15 April 25

Devara 2 : RRR సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ దేవర సినిమాతో వచ్చాడు. ఆ సినిమా జనాలకు అంతగా నచ్చకపోయినా ఫ్యాన్స్ కి నచ్చింది. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది. దీంతో ముందే చెప్పినట్టు దేవర 2 కూడా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చేసారు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో కూడా ఎన్టీఆర్ దేవర 2 కచ్చితంగా ఉంటుందని చెప్పారు.
అందరూ దేవర 2 ఉంటుందని చెప్తున్నారు కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పట్లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, నెల్సన్ సినిమాలు ఉన్నాయి. వీటి మధ్యలో దేవర 2 ఎక్కడ ఇరికిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా హీరో, దేవర నిర్మాత కళ్యాణ్ రామ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ ఏప్రిల్ 18 న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవర 2 గురించి మాట్లాడాడు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. దేవర కంటే ముందే ఎన్టీఆర్ వార్ 2 సినిమా ఓకే చేసాడు. సలార్ కంటే ముందే ప్రశాంత్ నీల్ కి ఓకే చెప్పాడు ఎన్టీఆర్. దేవర 2 కావాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దేవర 2 సినిమా కచ్చితంగా ఉంటుంది. వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత దేవర 2 ఉంటుంది. నెల్సన్ సినిమా కంటే ముందే ఉంటుంది అని తెలిపాడు.
దీంతో రెండు సినిమాల తర్వాత దేవర 2 ఉంటుంది. ఆ తర్వాతే తమిళ్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఈ లెక్కన 2027 లో దేవర 2 రావొచ్చు.
Also Read : Tamannaah : చెప్పులు లేకుండా.. ఎండలో.. కాళ్లకు బొబ్బలు వచ్చినా.. సినిమా కోసం తమన్నా కష్టాలు..