Tamannaah : చెప్పులు లేకుండా.. ఎండలో.. కాళ్లకు బొబ్బలు వచ్చినా.. సినిమా కోసం తమన్నా కష్టాలు..
తాజాగా మీడియాతో మాట్లాడిన సంపత్ నంది ఓదెల 2 సినిమా కోసం తమన్నా ఎంత కష్టపడిందో తెలిపాడు.
- By News Desk Published Date - 08:17 AM, Tue - 15 April 25

Tamannaah : మన సినిమా సెలబ్రిటీలు సినిమాల కోసం బాగానే కష్టపడతారని తెలిసిందే. అవసరం అయితే వాళ్ళు చేసే పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్తారు. తమన్నా ఇప్పుడు ఓ పాత్ర కోసం అలాగే కష్టపడింది. ఓదెల సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఓదెల 2 సినిమా ఏప్రిల్ 17 రిలీజ్ కానుంది. తమన్నా మెయిన్ లీడ్ లో హెబ్బా పటేల్, వసిష్ఠ సింహ.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ, మాటలు అందించి దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో కూడా సంపత్ నంది చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన సంపత్ నంది ఓదెల 2 సినిమా కోసం తమన్నా ఎంత కష్టపడిందో తెలిపాడు.
సంపత్ నంది తమన్నా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తమన్నా శివశక్తిగా కనిపిస్తుంది. ఇందుకోసం తమన్నా చాలా నియమాలు పాటించింది. తన పాత్ర షూటింగ్ జరిగినన్ని రోజులు తమన్నా చెప్పులు వేసుకోలేదు. ఎండలో చెప్పులు లేకుండానే నటించారు. దాని వల్ల ఆమె కాళ్లకు బొబ్బలు వచ్చి బాధపడింది. ఆ పాత్ర షూటింగ్ జరిగినన్ని రోజులు తమన్నా శాఖాహారిగా మారిపోయారు. గత కొన్నాళ్లుగా తమన్నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగింది. తమన్నా లుక్ కోసం కూడా మూడు గెటప్స్ ట్రై చేసి ఫైనల్ చేసాం. పాత్ర కోసం బట్టలు, రుద్రాక్ష మాలలు.. ఇలా తన ఒంటి మీద ఓ 20 కేజీల బరువు మోసింది. ఈ సినిమాలో తమన్నాకు మేకప్ వాడలేదు అని తెలిపారు.
Also Read : Allu Arjun : పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఆ సంఘటన తర్వాత మొదటిసారి..