Jr. NTR Donation: తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ విరాళం.. ఎంతంటే..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR Donation) రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఈ విరాళం ప్రకటించాడు.
- By Gopichand Published Date - 10:46 AM, Tue - 3 September 24

Jr. NTR Donation: తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహాయక చర్యలు మొదలుపెట్టారు. సీఎంలే స్వయంగా బరిలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ సైతం ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులకు తమ వంతుగా పలువురు ప్రముఖులు సాయం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024
ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR Donation) రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఈ విరాళం ప్రకటించాడు. “రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ. 50 లక్షలు విరాళం గా ప్రకటిస్తున్నాను” అని తారక్ ట్వీట్ చేశారు.
Also Read: Mouth Ulcers : నోటిపూతలు ఉన్నాయా..? వీటిని అప్లై చేయడం వల్ల రెండు రోజుల్లో ఉపశమనం లభిస్తుంది..!
ఎన్టీఆర్ ఇటీవల మంగళూరు వెళ్లి అక్కడ దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో పాటు నటుడు రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. వీరితో కలిసి రెండు రోజుల పాటు దైవ దర్శనాలు చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ చేరుకున్న తారక్ ఈ సందర్భంగా విరాళం ప్రకటించారు. ప్రస్తుతం యంగ్ టైగర్ కొరటాల శివతో దేవర సినిమా, బాలీవుడ్‌లో వార్-2 మూవీల్లో నటిస్తున్నారు. దేవర ఈ నెల సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. వార్-2 సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.