Janhvi Kapoor: గోల్డ్ కలర్ శారీలో జాన్వీ.. చీరకట్టులోనూ అదిరిన అందాలు!
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ను అమె అభిమానులు "జూనియర్ అతి లోక సుందరి" అని పిలుస్తారు.
- Author : Balu J
Date : 21-09-2023 - 1:27 IST
Published By : Hashtagu Telugu Desk
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ను అమె అభిమానులు “జూనియర్ అతి లోక సుందరి” అని పిలుస్తారు. ఆమె అసాధారణమైన అందం, ఆకట్టుకునే ఆకర్షణతో మెస్మరైజ్ చేయడమే అందుకు కారణం. ముఖ్యంగా ఆమె సహజమైన అందం సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా ఆమె మిలియన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇటీవల జాన్వీ స్టైలిష్‌గా డిజైన్ చేసిన గోల్డ్ కలర్ శారీ, బ్లౌజ్‌లో ఫోటోలను షేర్ చేసింది. చీరకట్టులోనూ ఆకట్టుకోవడంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా నటి జాన్వీ కపూర్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ దేవర(Devara)తో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ బ్యూటీతో దర్శకుడు సుకుమార్(Sukumar) ఐటెం సాంగ్లో నటింపజేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే ఈ సాంగ్ కూడా ఓ ఊపు ఊపేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో నటిస్తున్న ఈ బ్యూటీ మరిన్ని తెలుగు (Tollywood) సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. కథ నచ్చితే వేరే స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తానని చెబుతోంది.
Also Read: Vande Bharat Express: వచ్చే వారం నుంచి హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్