Janhvi Kapoor : జాన్వికి అలాంటి వాడు భర్తగా కావాలట.. దేవర బ్యూటీ కోరికలు బాగానే ఉన్నాయ్..!
Janhvi Kapoor శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో తన ఫాం కొనసాగిస్తుండగా ఇప్పుడు సౌత్ సినిమాల మీద కూడా ఫోకస్ చేసింది. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్
- By Ramesh Published Date - 10:55 AM, Thu - 16 May 24

Janhvi Kapoor శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో తన ఫాం కొనసాగిస్తుండగా ఇప్పుడు సౌత్ సినిమాల మీద కూడా ఫోకస్ చేసింది. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వాలని చూస్తున్న జాన్వి కపూర్ ఇప్పటికే తారక్ సరసన దేవర సినిమా చేస్తుంది. దేవరతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది అమ్మడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుంది. అప్పట్లో చిరంజీవి, శ్రీదేవి కాంబో లాగా.. చరణ్, జాన్వి కపూర్ జోడీ కూడా ఆడియన్స్ ని అలరించనుందని చెప్పొచ్చు.
అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న శ్రీదేవి ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఐనా సరే మీడియా ముందుకు వస్తే జాన్వి పెళ్లి ప్రస్తావన తెస్తుంటారు. సరే పెళ్లి ఇప్పుడు కాదు కానీ ఎలాంటి వాడు కవాలని వారు అడుగారు. దానికి సమాధానంగా తనకు కాబోయే వాడు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలని అంటుంది జాన్వి కపూర్. ఇంతకీ అమ్మడు ఏం చెప్పింది అంటే నా కలలను తనవిగా భావించే వాడు తనకు కావాలని అంటుంది.
అంతేకాదు ఎప్పుడు తనని సంతోషంగా ఉంచేలా చూడాలి. అతను నవ్వుతూ తనని నవ్విస్తూ ఉండాలని అన్నది. తను బాధపడే టైం లో కూడా పక్కనే ఉండి ధైర్యం చెప్పాలని అన్నది. అలాంటి అబ్బాయినే తాను పెళ్లాడతా అంటుంది జాన్వి కపూర్. మొత్తానికి మంచి అండర్ స్టాండింగ్ హస్బండ్ ని కోరుతుంది జాన్వి కపూర్.
ఇదిలాఉంటే జాన్వి కపూర్ తన ఫ్రెండ్ శిఖర్ ఫహారియాతో ప్రేమలో ఉంది అని ముంబై మీడియా హడావిడి చేస్తుంది. ఐతే జాన్వి కపూర్ మాత్రం ఈ విషయంపై నోరు విప్పలేదు.
Also Read : NTR Devara First Song : హుకుం సాంగ్ మర్చిపోతారట.. నిర్మాత కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!