Ram Charan : చరణ్ పెద్దిలో అలాంటి లుక్ ఉంటుందా..?
పూర్తిగా మాస్ లుక్ తో చరణ్ మెగా ఫ్యాన్స్ (Mega Fans) ని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. చరణ్ చేస్తున్న ఈ సినిమా కోసం పూర్తిస్థాయి మేకోవర్
- By Ramesh Published Date - 11:10 PM, Mon - 22 July 24

గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Global Star Ram Charan) త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ కి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ గా ఈ మూవీ చేస్తారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా నో కాంప్రమైజ్ అనేస్తున్నారట.
ఇదిలాఉంటే చరణ్ లుక్ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. పూర్తిగా మాస్ లుక్ తో చరణ్ మెగా ఫ్యాన్స్ (Mega Fans) ని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. చరణ్ చేస్తున్న ఈ సినిమా కోసం పూర్తిస్థాయి మేకోవర్ ఉంటుందని టాక్. ఆల్రెడీ చరణ్ రంగస్థలం సినిమాలో చరణ్ మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఐతే ఆ కథ వేరే ఆ సెటప్ వేరు. బుచ్చి బాబు సినిమా కథ వేరు.
అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకు తగినట్టుగా లుక్ ఉంటుందని తెలుస్తుంది. చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ (Rahaman) మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. రాం చరణ్ 16వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2026 లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
ఉప్పెన (Uppena) లాంటి సినిమా తీసి హిట్ అందుకున్న బుచ్చి బాబు తన సెకండ్ సినిమాతోనే గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్ ఎత్తుకున్నాడు. ఈ సినిమా కు కథే మొదటి బలమని తెలుస్తుంది. ఎలాగు RRR తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని అలరించిన చరణ్ తప్పకుండా ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ దక్కించుకుంటాడని తెలుస్తుంది.
Also Read : Surya 44 : సూర్య 44 అప్డేట్ వచ్చేసింది..!