Indrasena Reddy vs Samara Simha Reddy : ఇంద్రసేనా రెడ్డి vs సమర సింహా రెడ్డి.. రెడీ అంటే రెడీ..!
ఎన్టీఆర్ గారు కూడా టచ్ చేయని కొన్ని జానర్ లు బాలయ్య చేశారు. ఫ్యాషన్ సినిమాలంటే బాలయ్యే చేయాలి అనేలా ఆయన చేస్తుంటారు. బాలకృష్ణ చేసిన సమర సింహా రెడ్డి
- By Ramesh Published Date - 09:54 AM, Mon - 2 September 24

Indrasena Reddy vs Samara Simha Reddy నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ కు చిరంజీవి, వెంకటేష్ తో పాటు ఈ తరం యువ హీరోలంతా వచ్చారు. వేడుక సందర్భంగా ఇది బాలకృష్ణకు కాదు తెలుగు సినిమాకు జరుగుతున్న సత్కారం అని అన్నారు చిరంజీవి.
మహానుభావుడు ఎన్టీఆర్ కు వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ గారు కూడా టచ్ చేయని కొన్ని జానర్ లు బాలయ్య చేశారు. ఫ్యాషన్ సినిమాలంటే బాలయ్యే చేయాలి అనేలా ఆయన చేస్తుంటారు. బాలకృష్ణ చేసిన సమర సింహా రెడ్డి (Samara Simha Reddy) స్పూర్తితోనే ఇంద్ర (Indra) సినిమా చేశానని అన్నారు చిరంజీవి.
అంతేకాదు ఈమధ్య సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమర సిం హా రెడ్డి కథ వస్తే బాగుంటుందని. బోయపాటి శ్రీను, చౌదరి లాంటి వారు ఇది ప్లాన్ చేయాలని అన్నారు. బాలయ్య రెడీ అంటె తాను కూడా రెడీ అని అన్నారు చిరంజీవి (Chiranjeevi).
ఇక తను సినిమాల్లోకి రాకముందు ఫ్యాన్స్ మధ్య చిన్న చిన్న గొడవలు చూశాను. స్టార్స్ మధ్య స్నేహ బంధం ఉంటుంది. అలానే ఫ్యాన్స్ కూడా అలానే కలిసి మెలిసి ఉండాలని కోరారు చిరంజీవి. బాలకృష్ణ ఇలానే ఇంకా గొప్ప సినిమాల్ చేసి ప్రేక్షకులను అలరించాలని అన్నారు చిరంజీవి.
Also Read : Happy Birthday Pawan Kalyan: ఆంధ్రా రాజకీయాల్లో సూపర్ స్టార్ గా పవన్ కళ్యాణ్