Happy Birthday Pawan Kalyan: ఆంధ్రా రాజకీయాల్లో సూపర్ స్టార్ గా పవన్ కళ్యాణ్
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ సమయంలో ఆయన టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జెండా ఎగురవేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్‌లో సునామీ తెచ్చారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న ఆయన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.
- By Praveen Aluthuru Published Date - 09:41 AM, Mon - 2 September 24

Happy Birthday Pawan Kalyan: నటనా ప్రపంచం నుండి రాజకీయ వేదికపై బలమైన ఉనికిని చాటుకున్న పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ అనూహ్య విజయం తర్వాత, ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫానుగా అభివర్ణించారు. ఆ ఒక్క స్టేట్మెంట్ తో పవన్ కళ్యాణ్ రాజకీయ స్థాయి మరింత పెరిగింది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడిగా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు. నటనా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన అన్నయ్య చిరంజీవితో కలిసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కానీ 2009 ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా విజయం సాధించలేక పోవడంతో 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ సమయంలో ఆయన టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ముగిసినట్టేనని కామెంట్స్ వినిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు సైలెంట్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ టీడీపీతో జతకట్టి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. తన రాజకీయ జీవితంలో ఒడిదుడుకులన్నీ అధిగమించి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జెండా ఎగురవేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్‌లో సునామీ తెచ్చారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న ఆయన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఫలితంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవి లభించింది.100 శాతం స్ట్రైక్ రేట్‌తో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న పవన్ కళ్యాణ్.. తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన స్టార్లలో ఒకరు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్‌తో సమానంగా క్రేజ్‌ను సంపాదించారు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అరంగేట్రం చేశాడు. 1998లో తొలిప్రేమ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. 2013లో ఫోర్బ్స్ ఇండియా 100 మంది ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. అందులో పవన్ పేరు ఉండటం గమనార్హం.
Also Read: Helicopter Crash : ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్.. కారణం అదే