Allu Arjun Released: అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
- By Gopichand Published Date - 09:14 AM, Sat - 14 December 24

Allu Arjun Released: సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun Released) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆయన తరఫు న్యాయవాదులు రూ.50వేల పూచీకత్తును జైలు సూపరింటెండ్‌కు సమర్పించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిండంతో చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా పోలీసులు అల్లు అర్జున్‌ను ఆలస్యంగా అరెస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
#WeStandWithAlluArjun
Allu Sneha Reddy was very emotional… 🥺🥹#AlluArjun #AlluSnehaReddy #AlluArjun𓃵 #AlluArjunArrested pic.twitter.com/fRK2svUehO— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) December 14, 2024
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నాకు మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్యూ. తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతిచెందడం బాధాకరం. దానికి చింతిస్తున్నాను. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొలేదు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తా’’ అని పేర్కొన్నారు. తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని సినీనటుడు అల్లు అర్జున్ వెల్లడించారు. బాగానే ఉన్నానని.. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కేసు కోర్టులో ఉందని, తాను ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని పేర్కొన్నారు.
Also Read: One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ
పోలీసులు కావాలనే ఆలస్యం చేశారు: అల్లు అర్జున్ అడ్వకేట్
సినీనటుడు అల్లు అర్జున్ ఆలస్యంగా రిలీజ్ అవ్వడంపై తాము లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని ఆయన తరఫు అడ్వకేట్ అశోక్ రెడ్డి అన్నారు. వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్న కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా రాత్రంతా అధికారులు జైల్లో ఉంచారని ఆగ్రహించారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పారు.