HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Hyderabad 144 Section A Huge Loss For Tollywood

Hyderabad 144 Section : టాలీవుడ్ కు భారీ నష్టం

Hyderabad 144 Section : ఈ ఆంక్షలు చిత్రసీమ కు విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. రాబోయే తెలుగు సినిమా విడుదలకు సంబంధించిన పబ్లిక్ ఈవెంట్లను ప్రభావితం చేయనుంది

  • Author : Sudheer Date : 28-10-2024 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood 144
Tollywood 144

హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భద్రతా కారణాలతో బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు ఆంక్షలు (144 Section) విధిస్తూ హైదరాబాద్ పోలీసులు (Hyd Police) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షల ప్రకారం, 5 మందికి మించి గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించబడింది. ఈ నెల రోజుల సమయంలో హైదరాబాద్ లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని.. ఎవరైనా ర్యాలీలు, సభలు, సమావేశాలు పర్మిషన్ లేకుండా నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఈ ఆంక్షలు చిత్రసీమ (Tollywood) కు విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. రాబోయే తెలుగు సినిమా విడుదలకు సంబంధించిన పబ్లిక్ ఈవెంట్లను ప్రభావితం చేయనుంది. దసరా, దీపావళి సినిమాల ప్రమోషన్లు దాదాపుగా పూర్తయ్యాయి.

సూర్య నటించిన కంగువా (నవంబర్ 14): సూర్య తన పబ్లిక్ ప్రమోషన్లను ఇప్పటికే పూర్తి చేసినందున ఈ చిత్రంపై ఆంక్షల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.

నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (నవంబర్ 8): ఈ సినిమా కోసం ప్రమోషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఈ ఆంక్షల కారణంగా, పబ్లిక్ ఈవెంట్స్‌కు అనుమతులు లభించకపోవడం వల్ల ఇండోర్ ప్రమోషన్లపైనే నిఖిల్ టీమ్ ఆధారపడాల్సి వస్తుంది.

వరుణ్ తేజ్ మట్కా: ఈ సినిమా నవంబర్ చివర్లో విడుదల కానుండటంతో, దీపావళి తర్వాత భారీ ప్రమోషన్ల కోసం ప్లాన్ చేసిన వరుణ్ తేజ్ టీమ్ ఇప్పుడు ఇండోర్, ఆన్‌లైన్ ప్రమోషన్లకు మళ్లాల్సి ఉంటుంది.

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ (నవంబర్ 22): ఈ చిత్రం ప్రమోషన్ కూడా 144 సెక్షన్ కారణంగా ఇండోర్ ఈవెంట్లకు పరిమితం కానుంది.

అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ (డిసెంబర్ 5): 2024 లో విడుదల కానున్న అతిపెద్ద సినిమా కావడంతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. నవంబర్ 27 తరువాత ఆంక్షలు తొలగితే హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్ నిర్వహించవచ్చు. లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా కోసం ఇండోర్ ప్రమోషన్లు మాత్రం యథావిధిగా సాగుతాయి. మొత్తానికి, ఈ ఆంక్షల కారణంగా తెలుగు చిత్రాలు పబ్లిక్ ప్రమోషన్ ఈవెంట్లకు పరిమితం కాక, ఇండోర్ లేదా డిజిటల్ ప్రమోషన్లపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఈ ఆంక్షల పట్ల నగరవాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైములో ఇదే మాదిరి నిర్బంధం చేసారు..ఆ తర్వాత అంత సెట్ అయ్యింది. హైదరాబాద్ లో స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడి..ఏ టైములో పడితే ఆ టైం లో తిరగొచ్చు అని అంత అభిప్రాయం తో సిటీకి వస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ ఆంక్షల వల్ల వచ్చేవారు రాకపోగా..ఉన్న వారు కూడా బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ సర్కార్ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం.

Read Also : BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 144 section
  • A huge loss for Tollywood
  • CM Revanth Reddy
  • hyderabad
  • Hyderabad 144 Section
  • Hyderabad 144 Section - A huge loss
  • Hyderabad cp
  • tollywood

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd