Mohan Babu : మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్..అరెస్ట్ కు రంగం సిద్ధం ..?
Mohan Babu : ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే
- By Sudheer Published Date - 03:30 PM, Fri - 13 December 24

సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు హైకోర్టు నుంచి బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో, మోహన్ బాబును త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ కేసు సంబంధించి మోహన్ బాబుపై ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. జర్నలిస్టు పై దాడి మరియు హత్యాయత్నం వంటి నేరాల్లో ఆయన పాత్రను కోర్టు పరిశీలించింది. కోర్టు ముందు ఆయన హాజరయ్యే సమయంలో ఉన్న అభ్యంతరాలు, పోలీసుల విచారణ ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఈ పరిణామం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. మోహన్ బాబు అనేక చిత్రాలలో నటించి, తెలుగు సినీ రంగంలో చాలా ప్రఖ్యాతి గడించాడు. కానీ ఈ కేసు ఆయనకు నెగటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం, మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటె అల్లు అర్జున్ ను ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Also : Allu Arjun Arrest : కాంగ్రెస్ ప్రభుత్వంకు పెద్ద దెబ్బ…?