అయ్యప్ప మాలలో మెగా హీరో.. చరణ్ పిక్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తెలుగు అగ్రహీరోల్లో ఒకడు. ‘మాస్ ఆఫ్ మ్యాన్’ అని కూడా పిలువబడే చరణ్ తన నటనతో కాకుండా, డ్యాషింగ్ లుక్స్, ఫ్యాషన్ సెన్స్ తోనూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు.
- Author : Balu J
Date : 18-10-2021 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తెలుగు అగ్రహీరోల్లో ఒకడు. ‘మాస్ ఆఫ్ మ్యాన్’ అని కూడా పిలువబడే చరణ్ తన నటనతో కాకుండా, డ్యాషింగ్ లుక్స్, ఫ్యాషన్ సెన్స్ తోనూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. ఇవాళ ఆయన తన తండ్రి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. అయితే నల్లని దుస్తులు ధరించి, అయ్యప్ప మాలలో కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపర్చాడు. అయ్యప్ప దుస్తుల్లో ఉన్న చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారాయి. పవిత్రమైన వస్త్రధారణ, సొగసైన మీసం, హెయిర్‌స్టైల్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు.
రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తూనే, మరోవైపు ఆచార్య మూవీగా నిర్మాతగా మారాడు. ఈ మూవీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, చరణ్ అలియా భట్, అజయ్ దేవగన్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ జనవరి 7, 2022 న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం చరణ్ రెండు కొత్త సినిమాలకు సైన్ చేశాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో, ప్రశాంత్ నీల్ తో మరో పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు.