Clarity : పిల్లల్ని కనాలన్నది నా వ్యక్తిగత విషయం!
ఉపాసన కామినేని... మెగా హీరో రాంచరణ్ భార్య. తానేం హీరోయిన్ కాకపోయినా.. ఓ స్టార్ కు ఉన్న క్రేజ్ ఉపాసనకూ ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ, పలు ఆరోగ్యమైన విషయాలను షేర్ చేస్తుంటారు.
- By Balu J Published Date - 12:21 PM, Fri - 12 November 21

ఉపాసన కామినేని… మెగా హీరో రాంచరణ్ భార్య. తానేం హీరోయిన్ కాకపోయినా.. ఓ స్టార్ కు ఉన్న క్రేజ్ ఉపాసనకూ ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ, పలు ఆరోగ్యమైన విషయాలను షేర్ చేస్తుంటారు. ఉపాసన ఎప్పుడైతే మెగా ఇంట్లో అడుగుపెటిందో, అప్పట్నుంచే మెగా ఫ్యామిలీ ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఒకవైపు తన భర్త పట్ల కేరింగ్ ఉంటూనే, తన మామ చిరంజీవికి ఆరోగ్య పరమైన విషయాలను అందిస్తూ, మరింత ఫిట్ గా ఉండేలా తనవంతు సాయం చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ పై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. వ్యక్తిగత విషయాలపై కూడా అదే స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సంతానం గురించి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్లంతా ఒకే కాలంలో పెళ్లి చేసుకున్నారు. అయితే రామ్ చరణ్ తప్ప మిగిలిన ఇద్దరు హీరోలు తండ్రులయ్యారు. తమ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. అర్హా, అయాన్‌లతో బన్నీ.. అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే మెగా అభిమానులు మాత్రం ఆ పండగ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. జూనియర్ రామ్ చరణ్, జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తారు? అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయాలపై రామ్ చరణ్ ఎప్పుడూ పెదవి విప్పలేదు. అయితే ఉపాసన మాత్రం తమ పర్సనల్ విషయంలో మరింత సీరియస్ అవుతోంది. రామ్ చరణ్, ఉపాసన కు పెళ్లై దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. పెళ్లై ఎనిమిదేళ్లు అవుతున్నా.. పిల్లలను ఎందుకు కనడం లేదని? పిల్లలతో కెరీర్ కు ఏమైనా ఇబ్బందులు ఎదరవుతాయా? అనే విషయాలు టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతుంటాయి.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఉపాసన మరోసారి సీరియస్ అయింది. అని వ్యక్తిగత ప్రశ్న అడగడంతో కాస్త అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ రామ్ చరణ్ .. జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దానికి మీ సమాధానం ఏమిటి? అని యాంకర్ అడిగాడు. దీనిపై ఉపాసన కాస్త ఘాటుగా స్పందించింది. పిల్లల్ని ఎప్పుడు కనాలన్నది తన వ్యక్తిగత విషమయని చెప్పారు. ఈ విషయంలో తనకంటూ కొన్ని హద్దులు గీసుకున్నానని ఆమె అన్నారు. అయితే పిల్లల విషయంలో కొంతమంది రూమర్స్ క్రియేట్ చేయడం పట్ల అమె సీరియస్ అయ్యారు. తన వ్యక్తిగత విషయం గురించే మాట్లాడేవాళ్లకు సమాధానం చెప్పే అవసరం లేదని తేల్చి చెప్పింది. సరైన సమయంలో గుడ్ న్యూస్ చెప్తానని అంటోంది ఉపాసన.
Related News

Sudheer Babu : మహేష్ ని కంగారు పెట్టించిన సుధీర్ బాబు.. ఏం జరిగిందంటే..!
ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) సినిమాల పరంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కావట్లేదు